ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు - IMD అలర్ట్

Published by: Shankar Dukanam

తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి

విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు

కుండపోత వర్షాలతో గుంటూరులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోవడంతో ముగ్గురు మృతి చెందారు

భారీ వర్షాలతో ఏపీలో 6 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు

హైదరాబాద్ లో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు

తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది

తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది

వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైల్వే పలు రైలు సర్వీసులు రద్దు చేసింది