ఏపీలో సీప్లేన్ సేవలు ప్రారంభం, విజయవాడ - శ్రీశైలం మధ్య సక్సెస్ దేశంలో గతంలో గుజరాత్‌లో ప్రారంభించిన సీప్లేన్ పర్యాటకం ఆంధ్రప్రదేశ్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ‘సీ ప్లేన్’లో ప్రయాణించారు. ట్రయల్ రన్ సక్సెస్ అయిన తరువాత సీఎం చంద్రబాబు సాహోసోపేతమైన ఈ జర్నీలో పాలు పంచుకున్నారు విజయవాడ నుంచి కేవలం 40 నిమిషాల్లోనే శ్రీశైలం చేరుకున్నారు. అంటే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పట్టే సమయం ఇందులోనే లెక్కించారు తక్కువ ధరలకే సీప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు తెలిపారు. ల్యాండింగ్, టేకాఫ్ విషయంలో సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. భూమి మీద కంటే నీటిలో ఈజీగా జరిగాయన్నారు విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి క్షేత్రాలను సీప్లేన్‌తో కలపడం తన అదృష్టమన్నారు చంద్రబాబు.