War Condoms: కండోమ్స్‌తోనే పాకిస్తాన్‌ను ఓడించిన సైన్యం - 1971 యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా ?
1971 War Stroy: ఉపయోగించాడనికి పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటే చాలదు. విపత్కర పరిస్థితుల్లో సరిగ్గా ఉపయోగించడానికి చిన్న చిన్న ఐడియాలు కూడా ఉండాలి. అలాంటి ఐడియానే 1971లో సైన్యం పాకిస్తాన్ ను ఓడించింది.

Condoms for a secret operation against Pakistan: పాకిస్తాన్ పై యుద్ధంలో భారత సైనికులు వ్యూహాత్మకంగా కండోమ్స్ వాడి బురిడీ కొట్టించారు. 1971 భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత సైన్యం ఎన్నో ఆసక్తికరమైన , అసాధారణమైన వ్యూహాలతో పాకిస్తాన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. అందులో ఒకటి వినూత్నంగా కండోమ్‌లను ఉపయోగించి పాకిస్తాన్ ను బోల్తా కొట్టిచిన ఘటన. ఆనాటి యుద్ధ వ్యూహాలలో కండోమ్‌లు కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన డిసెంబర్ 1971లో జరిగింది.
ఏం జరిగిందంటే ?
1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ ద్వారా భారత్ కు చెందిన ఎనిమిది వైమానిక స్థావరాలపై ( ముందస్తు దాడులు చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది. తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యం కోసం బెంగాలీ జాతీయవాదులకు మద్దతు ఇచ్చింది. 13 రోజుల తీవ్ర యుద్ధం తర్వాత, డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ తూర్పు కమాండ్ ఢాకాలో లొంగిపోయింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో సుమారు 93,000 పాకిస్తానీ సైనికులు భారత సైన్యం చేతిలో ఖైదీలుగా పట్టుబడ్డారు.
కండోమ్‌లను ఎలా యుద్ధ వ్యూహాలకు ఉపయోగించారంటే ?
భారత నావికాదళం , సైన్యం రెండు విభిన్న సందర్భాల్లో కండోమ్‌లను వినూత్నంగా ఉపయోగించాయి. ఇవి యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించాయి భారత నావికాదళం తూర్పు పాకిస్తాన్‌లోని చిట్టగాంగ్ ఓడరేవు వద్ద పాకిస్తానీ ఓడలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఓడరేవు పాకిస్తాన్ రవాణా మార్గాలకు కీలకమైనది. ఈ ఓడలను నీటి అడుగున పేల్చడం ద్వారా నాశనం చేయాలని భారత నావికాదళం ప్లాన్ చేసుకుంది. ఇందుకోసం భారత నావికాదళం ఉపయోగించిన "లింపెట్ మైన్" అనే పేలుడు పరికరం ఓడల అడుగున ఉంచాల్సి ఉండేది. ఈ పేలుడు పదార్థం ఒక soluble plug నీటిలో కరిగిపోతుంది. దీని వల్ల 30 నిమిషాల్లోనే పేలిపోయే సమస్య ఉండేది. ఇది డైవర్లు పేలుడు పదార్థానికి ఓడకు అమర్చి సురక్షితంగా బయటకు వచ్చేంత సమయం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత నావికాదళ అధికారులు ఒక వినూత్న ఆలోచనన చేశారు. లింపెట్ మైన్‌ల పేలుడు ప్లగ్‌ను కండోమ్‌లతో కప్పి ప్రయోగించారు. కండోమ్‌లు నీటి నుండి ప్లగ్‌ను రక్షించి భారత సైన్యం అనుకున్న సమయానికి పేలేలా చేశాయి.
ప్రత్యేకమైన ఆపరేషన్
ఈ ఆపరేషన్‌లో భాగంగా డైవర్లు 5-10 కి.మీ. దూరం ఈత కొట్టడానికి శిక్షణ పొందారు. ప్రతి డైవర్ 4-5 పేలుడు పదార్థాలను తన శరీరానికి కట్టుకొని, పాకిస్తానీ ఓడల అడుగున అమర్చారు. కండోమ్‌ల వల్ల మైన్‌లు సమయానికి పేలి, ఓడలను విజయవంతంగా నాశనం చేశాయి. చిట్టగాంగ్ పోర్ట్ ఆపరేషన్ పాకిస్తాన్ రవాణా మార్గాలను నిర్వీర్యం చేసింది, ఇది తూర్పు పాకిస్తాన్‌లో వారి స్థానాన్ని బలహీనపరిచింది. ఈ ఆపరేషన్ భారత నావికాదళం వ్యూహాత్మక విజయంగా గొప్పగాచెబుతారు. ఆపరేషన్ సీ సైట్ లేదా ఆపరేషన్ ఎక్స్ అనిపేరుతో పిలిచారు. అప్పట్లో కండోమ్‌ల భారీ ఆర్డర్‌లు నావికాదళ ఉన్నతాధికారులలో కూడా ఆందోళన కలిగించాయి, కానీ ఈ వినూత్న వ్యూహం గురించి తెలిసిన తర్వాత ఆమోదం లభించింది.
ఆర్మీ కూడా వినూత్నంగా కండోమ్‌ల వినియోగం
నేవీతో పాటు ఆర్మీ కూడా కండోమ్‌లను వినియోగించింది. బంగ్లాదేశ్‌లోని బురదమయమైన , తడిగా ఉండే భూభాగంలో భారత సైన్యం పోరాడాల్సి వచ్చేది. ఈ ప్రాంతంలో వారి రైఫిల్స్ తడిసిపోవడం వల్ల ఆయుధాలు పనిచేయకపోవడం లేదా దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యను అధిగమించడానికి, సైనికులు తమ తుపాకుల మజిల్స్‌పై కండోమ్‌లను కప్పారు. కండోమ్‌లు నీటి నుండి ఆయుధాలను రక్షించి, తడి భూభాగంలో కూడా తుపాకులు పొడిగా ఉండేలా చేశాయి. ఈ విధానం సైనికులకు యుద్ధంలో నమ్మకమైన ఆయుధాలను అందుబాటులో ఉంచడంలో సహాయపడింది. ఈ తెలివైన వ్యూహం సైనికుల ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి వీలు కల్పించింది.
1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో కండోమ్‌ల ఉపయోగం ఒక అసాధారణ, ఆసక్తికరమైన ఘటన. అందుకే యుద్ధం అనే ప్రస్తావన వస్తే చాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు.





















