అన్వేషించండి

Crime News: బిడ్డ ఎవరికి పుట్టాడు, పోలికలు రాలేదంటూ అత్తింటి వేధింపులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Telangana Crime News | అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి వారు కొత్తగా అనుమానాలు లేవనెత్తి మాటలు అనడంతో వివాహిత పుట్టింట్లోనే ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఘటన జరిగింది.

జగిత్యాల: పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ ఆ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పెళ్లి జీవితం నరకంగా మారింది. అదనపు కట్నం కోసం వేధింపులు, ఆ బిడ్డ ఎవరికి పుట్టాడంటూ అనుమానించడంతో పుట్టింట్లోనే ఆత్మహత్య చేసుకుంది. అద్దం పైన సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం చెందింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.  

అసలు ఏం జరిగిందంటే..
జగిత్యాలకు చెందిన గంగాధర్, శోభ దంపతుల కూతురు లక్ష్మీ ప్రసన్న కు రెండేళ్ల కిందట తిరుపతితో వివాహం జరిగింది. తిరుపతి స్వస్థలం వెలగటూరు మండలం రాంనూర్. కాగా, ఈ దంపతులు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఈ క్రమంలో ఏడాది కిందట లక్ష్మీ ప్రసన్న ఓ పండంటి బాబుకి జన్మనిచ్చింది. కొడుకు పుట్టాక ఆమె సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి కుమారుడి ఆలనా పాలనా చూసుకుంటోంది. అయితే కొడుకు పుట్టిన తర్వాత లక్ష్మీప్రసన్నకు అత్తింటి వారి నుంచి వేధింపులు అధికమయ్యాయి. 55 లక్షలు కట్నం ఇస్తామని ఒప్పుకొని మనం 10 లక్షలు ఇచ్చారని.. భూమి అమ్మేసి మిగతా డబ్బులు ఇవ్వలేదని ఆమెను వేధిస్తున్నారు. వారం రోజుల కిందట బెంగళూరు నుంచి తిరుపతి, లక్ష్మీప్రసన్న రామ్నూరుకు వచ్చారు.

బుధవారం నాడు రాంనూర్ వెళ్లిన గంగాధర్ తన కుమార్తె లక్ష్మీప్రసన్న, ఏడాది మనవడిని తీసుకొని జగిత్యాలకు వచ్చారు. అదే రోజు సాయంత్రం లక్ష్మీ ప్రసన్న ఫ్యాన్ కు ఉ రేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా.  వారు మృతదేహాన్ని జగిత్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. 

తన కూతురి మరణానికి భర్త తిరుపతి, ఆమె అత్తమామలు, ఆడపడుచులే కారణమని లక్ష్మీప్రసన్న తండ్రి గంగాధర్ ఫిర్యాదు చేశారు. వారు వేధిస్తున్నారని, బాబు ఎవరికి పుట్టాడు అంటూ వేధించడంతో తన కుమార్తె చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాకు బతకాలని లేదు. నా కుమారుడు జాగ్రత్త అమ్మానాన్న.. నా బాబుని మాత్రం వాళ్లకు ఇవ్వకండి అని ఇంట్లో అద్దంపై రాసి ఆత్మహత్య చేసుకుందని గంగాధర్ ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు భర్త తిరుపతి అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే బాధ్యులను అరెస్టు చేసి ఏం చేస్తామన్నారు సీఐ వేణుగోపాల్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
CM Revanth Reddy: తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget