Nagpur Odi Toss Updates: భారత బౌలింగ్.. జట్టులో ప్రధాన మార్పులు, రోహిత్ బరిలోకి, ఇద్దరు ఆటగాళ్ల డెబ్యూ
ఇరుజట్ల మధ్య 107 మ్యాచ్ లు జరుగగా, 58 వన్డేల్లో భారత్ గెలుపొందగా, 44 మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచి 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యం దక్కించుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.

Ind Vs Eng Odi Series Live Updates: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ పోరు ప్రారంభమైంది. దాదాపు ఆరునెలల తర్వాత మరో వన్డే సిరీస్ ను టీమిండియా ఆడుతోంది. గతేడాది శ్రీలంకతో ఆడిన తర్వాత తొలిసారిగా భారత్ వన్డేలు ఆడబోతంది. నాగపూర్ లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. టీ20 జట్టుతో పోలిస్తే వన్డే జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కెప్టెన్, కొత్త ఓపెనర్లు, కొత్త మిడిలార్డర్ తో భారత్ ఫ్రెష్ గా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో నెగ్గి మూడు వన్డేల సిరీస్ లో శుభారంభం చేయాలని భావిస్తోంది. భారత జట్టులో రోహిత్, శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితర స్టార్లతో బలంగా కనిపిస్తోంది. గాయం కారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేసర్ హర్షిత్ రాణా డెబ్యూ చేశారు. ఇక ఇంగ్లాండ్ జట్టులో వెటరన్ స్టార్ జో రూట్ జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్ కు స్వర్గధామంగా పిచ్ ను రూపొందించారు. రాత్రి పూట మంచు కురుస్తుందని అంచనా ఉంది.
🚨 Team News
— BCCI (@BCCI) February 6, 2025
We have 2⃣ ODI debutants in the Playing XI today - Yashasvi Jaiswal and Harshit Rana 🧢 🧢
A look at our line-up 🔽
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/EFQQJmUFwh
ఇద్దరు ఆటగాళ్ల డెబ్యూ..
ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేయనున్నారు. ఇప్పటికే టెస్టులు, టీ20లు ఆడిన యశస్వి జైస్వాల్ వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. కెప్టెన్ రోహిత్ తో కలిసి తను ఓపెనింగ్ చేయబోతున్నాడు. తర్వాత శుభమాన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ బాగా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్ హర్షిత్ రాణా కూడా డెబ్యూ చేశాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీతో కలిసి తను కొత్త బంతిని పంచుకోనున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ గా ఆడుతున్నాడు. టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్ లోకి వచ్చినా, తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి గాయంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.
📸 📸
— BCCI (@BCCI) February 6, 2025
𝙄𝙣 𝙋𝙞𝙘𝙨: Those debut moments, ft. Yashasvi Jaiswal and Harshit Rana 🧢 🧢
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ryBC6A8z67
హోరాహోరీ..
ఇరుజట్లు పేపర్ మీద బలంగా ఉండటంతో పోరు హోరాహోరీగా సాగబోతోందని తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో రాణించడం కెప్టెన్ రోహిత్ శర్మకు తప్పనిసరి. ఆదిలోనే సత్తా చాటి ఆత్మవిశ్వాసం పొందాలని చూస్తున్నాడు. మరోవైపు జైస్వాల్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు టీ20 సిరీస్ లో ఘోరంగా ఓడిపోయినా ఇంగ్లాండ్ ప్రతీకారేచ్ఛతో రగిలి పోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి, భారత్ పై పైచేయి సాధించాలని భావిస్తోంది. వెటరన్ స్టార్ రూట్ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. టీ20 సిరీస్ ఓడిపోయినా వన్డేల్లోనూ దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఇక వైట్ బాల్ జట్టు కోచ్ గా కూడా ప్రమోషన్ పొందిన మెకల్లమ్.. ఈ మ్యాచ్ లో జట్టు విజయం కోసం ప్రణాళికలు రచించాడు. ఇరుజట్లు పటిష్టంగా కనిపిస్తుండటంతో తొలి వన్డేలో పోటాపోటీగా జరగడం ఖాయం. సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి పట్టు సాధంచాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి.




















