Meeting of Telangana Congress MLAs: స్థానిక ఎన్నికల్లో అత్యధికం ఏకగ్రీవం చేసుకోండి - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ దిశానిర్దేశం
Telangana: స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు రేవంత్ సూచించారు. ఎంసీహెచ్ఆర్డీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో కీలక సూచనలు చేశారు.

Revanth advised the MLAs to be unanimous in the local elections: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. కులగణనతో పాటు పలు పథకాలు అమలు చేస్తున్నందున అన్నింటినీ ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు. రెండు వారాల్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున అందులో ప్రజల్లోనే.. గ్రామాల్లో ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో అత్యధికం ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సూచించారు.
గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో నిధులకు మంత్రుల్ని కలవాలి !
గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులు ఉంటే సీసీరోడ్లు, ఆలయాలు , ఇతర పనులకు సంబంధించి నిధుల కోసం సంబంధిత మంత్రుల్ని కలవాలని సూచించారు. కులగణన చట్టబద్దం అయినా అవకపోయినా. నియోజకవర్గ స్థాయిలో నలభై రెండు శాతం పదవులు బీసీలకు కేటాయించేలా బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. పార్టీలో చేరిన వారితో కలిసి పని చేయాలని.. సమన్వయం తెచ్చుకోవాలని సూచించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణను ఆయా వర్గాల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఓ భారీ బహిరంగసభను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
స్థానిక ఎన్నికలు టార్గెట్‌గా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం
స్థానిక ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే రాజ్యాంగపరమైన చిక్కులు ఉండటం వల్ల కులగణన ఆధారంగా రిజర్వేషన్ల చట్టం చేయడం సాధ్యం కాదు. అందుకే రేవంత్ రెడ్డి రాజకీయంగా రిజర్వేషన్లు ఇద్దామని సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీలు ఇంకా స్పందించలేదు. ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇస్తామన్నారు కాబట్టి చట్టబద్దంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేయడంతో.. ఇక వర్గీకరణ ఆధారంగా ఉద్యోగ ప్రకటనలిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
గ్రామాల్లోనే ఉండాలని నేతలకు సూచించిన సీఎం
మొత్తం గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేలా అటు కుల సమీకరణాలు.ఇటు రాజకీయ సమీకరణాలను కూడా చూసుకుని రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలను కూడా బహిరంగంగా మాట్లాడకుండా ట్యూన్ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారంతా పూర్తిగా ఎన్నికల మూడ్ లోనే ఉండనున్నారు. ఈ నెలలోనే ప్రాదేశిక, స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసే అవకాశం ఉంది.
Also Read: తెలంగాణలో రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త- ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

