అన్వేషించండి
Amla Benefits : ఉసిరికాయలను ఇలా తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందట
Diabetic Management : ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని డైట్లో రెగ్యూలర్‌గా యాడ్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుందట తెలుసా?

ఉసిరికాయలు ఇలా తీసుకుంటే డయాబెటిస్ దూరమవుతుంది(Images Source : Instagram/Envato)
1/7

కార్తీకమాసంలో దొరికే ఉసిరి కాయలు కేవలం పూజకే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందిస్తాయి. వీటిని కొన్ని రకాలుగా తీసుకుంటే డయాబెటిస్‌ని కూడా కంట్రోల్ చేయవచ్చట.
2/7

ఉసిరికాయలను కోసి.. గింజలు తీసేసి.. వాటితో జ్యూస్ చేసుకోవాలి. దానిలో నీరు వేసి డైల్యూట్ చేసి.. తాగితే చాలామంచిది. కాస్త తేనె కలిపి రెగ్యూలర్‌గా తీసుకుంటే మధుమేహం కంట్రోల్ అవుతుంది.
3/7

ఉసిరికాయలను పౌడర్‌గా చేసుకుని స్మూతీలు, యోగర్ట్, ఓట్మీల్లో కలిపి రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. దీనిలోని న్యూట్రిషనల్ వాల్యూలు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచిని కూడా ఇస్తాయి.
4/7

ఉసిరి గింజలు కూడా డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయి. వీటిని సలాడ్స్‌లో ట్యాంగీ ఫ్లేవర్ కోసం ఉపయోగించుకోవచ్చు. కీరదోస, క్యారెట్స్, టోమాటోలతో సలాడ్ చేసుకుని వాటిలో ఈ గింజలు వేసుకుని తినొచ్చు.
5/7

ఉసిరికాయలతో పచ్చడి, నిల్వ పచ్చడి కూడా చేసుకుంటారు. వీటిని రెగ్యూలర్‌గా ఫుడ్స్‌తో కలిపి తినవచ్చు. ఇది షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది.
6/7

ఉసిరికాయలను నీటిలో వేసి మరిగించి.. ఉసిరి టీగా తీసుకోవచ్చు. దీనిలో అల్లం, నిమ్మకాయ వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
7/7

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఉసిరికాయలను డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
Published at : 11 Oct 2024 03:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రికెట్
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion