ADA: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో సైంటిస్ట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ADA) బెంగళూరు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ADA Recruitment: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ADA) బెంగళూరు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 133 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 133
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రికల్ &ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్.
⏩ సైంటిస్ట్-బి: 103 పోస్టులు
➥ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్: 26 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 13, ఎస్సీ-03, ఎస్టీ-01, ఓబీసీ- 07, ఈడబ్ల్యూఎస్- 02.
➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 16 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 08, ఎస్సీ-02, ఎస్టీ-01, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 01.
➥ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రికల్ &ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 08, ఎస్సీ-02, ఎస్టీ-01, ఓబీసీ- 03, ఈడబ్ల్యూఎస్- 01.
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 33 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 16, ఎస్సీ-04, ఎస్టీ-02, ఓబీసీ- 08, ఈడబ్ల్యూఎస్- 03.
➥ మెటలర్జీ ఇంజినీరింగ్: 02 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 02.
➥ ఏరోనాటికల్ ఇంజినీరింగ్: 13 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 08, ఎస్సీ-01, ఓబీసీ- 03, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21.04.2025 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.90,789.
⏩ సైంటిస్ట్-సి: 32 పోస్టులు
➥ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్: 05 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 06 పోస్టులు
➥ ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రికల్ &ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 04 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 12 పోస్టులు
➥ మెటలర్జీ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఏరోనాటికల్ ఇంజినీరింగ్: 04 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, గేట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21.04.2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.1,08,073.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.04.2025.





















