Rasi Phalalu Today 10th April 2025: మేష రాశివారు మంచి ప్లాన్ వేస్తారు..మిథునం వారు తెలివిగా సమస్యలు పరిష్కరించుకుంటారు - మేషం to మీనం ఏప్రిల్ 10రాశిఫలితాలు
Rasi Phalalu Today in Telugu 10th April 2025 : మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య తదితర రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఏప్రిల్ 10 గురువారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఓ శుభవార్త వింటారు. ఈ రోజు మీరు ప్రతి పనిని ప్లాన్ చేసిన ప్రకారం పూర్తిచేస్తారు. మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని ధార్మిక కార్యక్రమాలకు కాటాయిస్తే మానసిక శాంతి లభిస్తుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టిసారిస్తారు. మీ వ్యాపార సంబంధిత చాలా పనులు అనుకున్న ప్రకారం పూర్తవుతాయి.
వృషభ రాశి
ఈ రోజు మీకు శుభ ఫలితాలున్నాయి. ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కొత్త సమాచారాన్ని నేర్చుకుంటారు. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఇబ్బంది ఉండదు. కార్యాలయంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు.
మిథున రాశి
ఈ రోజు మీరు తెలివితేటలు, వివేచనతో సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. బంధువుల ఇంటి నుంచి ఆహ్వానం లభిస్తుంది. ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉండటం వల్ల మీ సొంత పనులు పూర్తిచేసుకోలేరు. నూతన పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక ముఖ్యమైన అంశంపై సలహా-సూచనలు ఇస్తారు..వాటి నుంచి సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. మీరు పనిచేసే ప్రదేశంలో బయటవ్యక్తి గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి. ఆస్తి అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించిన చర్యలు జరుగుతున్నట్లయితే మీరు లాభపడతారు. శారీరకంగా, మానసికంగా మీరే మీకు బలం అనిపిస్తుంది. ఒకరి ప్రతికూల మాటలవల్ల కొద్దిసేపు మీ మానసిక స్థితి చెడిపోతుంది.తప్పనిసరి అయితేకానీ ఈ రోజు ప్రయాణం చేయకపోవడమే మంచిది. వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టండి. వ్యాపార కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలపై దృష్టి పెట్టండి.
కన్యా రాశి
ఈ రోజు ఓ ప్రత్యేక వ్యక్తి మార్గదర్శకత్వంలో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఏదో ఒక ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంది. ధార్మిక సంస్థలో సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. ఏ పనినైనా నిర్లక్ష్యం వల్ల అసంపూర్తిగా వదిలిపెట్టకండి. పితృ సంపదకు సంబంధించిన విషయంలో రేపు మీకు విజయం లభిస్తుంది. రేపు ఇతరుల వ్యక్తిగత విషయాలకు మీరు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో ఆదాయాన్ని పెంచడానికి చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
తులా రాశి
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ ఆత్మగౌరవం , ఆత్మవిశ్వాసం , కష్టపడే తత్వం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. వ్యర్థమైన కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సహకారం తీసుకోవడం ఉత్తమం. మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. భూమి లేదా వాహనానికి సంబంధించిన ఏదో ఒక పని పూర్తవుతుంది. కొంత సమయాన్ని మీ వినోదానికి కూడా కేటాయిస్తారు. మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. విద్యార్థులు తమ చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆఫీసులో వ్యవస్థీకృత వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరు నమ్మకం సంబంధాన్ని బలపరుస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ధార్మిక లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ వ్యక్తిగత పనులు కూడా కుటుంబ సభ్యుల సహాయంతో చాలా వరకు పూర్తవుతాయి. ఇంటి పెద్దల మార్గదర్శకత్వాన్ని ఉల్లంఘించకండి. అపరిచితులతో మీ వ్యక్తిగత ప్రణాళికలను పంచుకోకండి. ప్రభుత్వ ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల మీరు అదనపు సమయం కేటాయించాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య ఉన్న విభేదాలు ముగుస్తాయి.
మకర రాశి
ఈ రోజు మీకు మెరుగ్గా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలి. ఇతరుల వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టకుండా మీ పనిపట్ల ఏకాగ్రతతో ఉండండి. కొంత సమయాన్ని ఒంటరిగా, ధ్యానంతో గడుపుతారు. ఈరోజు వ్యాపార కార్యక్రమాలు సజావుగా సాగుతాయి, అయితే ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఆఫీసులో ప్రమోషన్‌కు సంబంధించి ఏదో ఒక శుభవార్త రావడానికి అవకాశం ఉంది.
కుంభ రాశి
ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించేవారు శుభవార్త వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మేధో సామర్థ్యం మంచి ఫలితాలు వచ్చేలా చేస్తుంది. కెరీర్‌కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ రావడం సంతోషంగా ఉంటుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి . సమయానికి తగినట్లుగా మీ ప్రవర్తనలో మార్పు తీసుకురావడం అవసరం. మీ దాంపత్య జీవితం బావుంటుంది.
మీన రాశి
ఈ రోజు మీరు అనకూల ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. అనుభవజ్ఞుల సహవాసంతో మంచి విషయాలు నేర్చుకుంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది కానీ విజయం లభిస్తుంది. ఆర్థిక కార్యక్రమాల విషయంలో ఎవరినీ ఎక్కువగా నమ్మకండి. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. ఉద్యోగంలో మీ లక్ష్యాన్ని సాధించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















