Good Bad Ugly: అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీకి షాక్ - విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో ఫుల్ వీడియో లీక్
Good Bad Ugly Leaked Online: కోలీవుడ్ స్టార్ అజిత్ లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్లలో వచ్చిన కొన్ని గంటలకే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది.

Ajith's Good Bad Ugly Movie Full Movie Leaked In Online: ఇటీవల సినీ ఇండస్ట్రీని లీకులు వదలడం లేదు. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే ఆన్‌లైన్‌లో లీక్ కావడం అటు మేకర్స్, ఇటు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. దీనిపై టీం పోలీసులను ఆశ్రయించింది.
ఆన్‌లైన్‌లోకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
తాజాగా గురువారం విడుదలైన కోలీవుడ్ ఐకాన్ అజిత్ (Ajith) లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) సైతం పైరసీ బారిన పడినట్లు తెలుస్తోంది. కొన్ని ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. థియేటర్లలో విడుదలైన కొన్ని గంటలకే ఈ చిత్రం అనధికార కాపీలు పలు వెబ్‌సైట్లలో ప్రసారం కావడం ప్రారంభించాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ టీం షాక్‌కు గురైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్లపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. పైరసీని అరికట్టాలని సినీ ప్రియులు కోరుతున్నారు.
Also Read: 'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
సినిమాలో వింటేజ్ అజిత్
ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటించగా.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అర్జున్‌దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో అజిత్ యాక్షన్ సీన్స్, వింటేజ్ లుక్స్ అదిరిపోయాయని అంటున్నారు. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ అంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం అజిత్ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాను తెరకెక్కించారని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మంచి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇంకొందరు నెట్టింట తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.
అసలు స్టోరీ ఏంటంటే?
రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే (అజిత్) పేరు మోసిన గ్యాంగ్ స్టర్. ఎన్నో ఏళ్లు చీకటి సామ్రాజ్యానికి డాన్‌గా వ్యవహరించిన అతను తన భార్య రమ్య (త్రిష) కోరిక మేరకు అన్నింటినీ వదిలేస్తాడు. ఆ తర్వాత జైలుకు వెళ్తాడు. అలా 17 ఏళ్లు జైల్లోనే గడిపిన అతను విడుదలైన తర్వాత తన కొడుకు విహాన్ (కార్తీక్ దేవ్)ను చూసేందుకు తన భార్యతో కలిసి స్పెయిన్ వెళ్లేందుకు రెడీ అవుతాడు.
ముంబై నుంచి స్పెయిన్ బయలు దేరిన ఏకే ఫ్యామిలీ దగ్గరకు కొందరు గ్యాంగ్‌స్టర్స్ వస్తారు. వాళ్ల దాడి నుంచి త్రుటిలో తప్పించుకుంటాడు ఏకే. ఇదే టైంలో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలంటే పాత గొడవలు సెటిల్ చేసుకుని రమ్మని భార్య చెబుతుంది. మరోవైపు స్పెయిన్‌లో అతని కొడుకును ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఓ డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యేలా చేస్తుంది. దీంతో మళ్లీ అతను గ్యాంగ్‌స్టర్‌గా మారాడా?, అసలు అతని కొడుకుని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు? తన కొడుకుని కాపాడుకున్నాడా?, ఏకేకు ఆ ముఠాలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.






















