అన్వేషించండి
Brahmamudi Serial Today December 07 Highlights : కావ్యకు షాక్ ఇచ్చిన సుభాష్.. తాతయ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా - బ్రహ్మముడి డిసెంబరు 07 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య విషయంలో తగ్గేదేలే అన్న రాజ్ కి ఇచ్చిపడేస్తారు సీతారామయ్య, ఇందిరాదేవి. ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య. ఇప్పటి నుంచి కొత్త కష్టాలు మొదలు...

Brahmamudi Serial Today December 07 Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/11

సీతారామయ్య కోమాలోకి వెళ్లిపోయారని డాక్టర్ చెబుతారు. మనకు రావాల్సింది ఇవ్వకుండా ముసలోడు ఇలా చేశాడేంటి అని రుద్రాణి-రాహుల్ అనుకుంటారు. నేను ఇక్కడుంటాను మీరంతా ఇంటికి వెళ్లండి అంటాడు కళ్యాణ్. అంతా వెళ్లిపోతారు..
2/11

సీతారామయ్య పరిస్థితి తెలుసుకున్న కనకం.. కావ్య అడుగుపెట్టడం వల్లే ఇలా జరిగింది అంటారేమో అని భర్తకు చెప్పుకుని బాధపడుతుంది. మన అమ్మాయి కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వెళ్లి చూసొద్దామా అంటే ఇప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదు వద్దు అనేస్తాడు కృష్ణమూర్తి
3/11

సీతారామయ్య ఫొటో పట్టుకుని బాధపడుతున్న ఇందిరాదేవిని కావ్య ఓదారుస్తుంది. ఆయనతోనే జీవితం..అలాంటి పరిస్థితుల్లో బావని చూసేకన్నా చచ్చిపోవడం మంచిదనిపిస్తోందని ఏడుస్తుంది. తాతయ్యగారు మిమ్మల్ని తిరిగి కలుస్తారనే నమ్మకంతో ఉండండి అని ధైర్యం చెబుతుంది. ఆయన తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంగా ఉండాలని చెబుతుంది
4/11

ఇంట్లో వాళ్లంతా భోజనం చేయలేదు..మీరు వస్తే అంతా వస్తారని చెప్పి తీసుకెళుతుంది. అందరకీ కావ్య భోజనం వడ్డిస్తుంది. అడుగు ధాన్యలక్ష్మి అని ముందుకు తోస్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మి ఉరేసుకునేందుకు సిద్ధపడినా జాలి, దయ లేదా అంటుంది. నాన్నకు జరగరానిది జరగకముందే నిర్ణయం తీసుకోండి అంటుంది
5/11

ధాన్యలక్ష్మికి ఆస్తి రాయించేందుకు ఎంత కమిషన్ తీసుకున్నారని రుద్రాణిపై కావ్య ఫైర్ అవుతుంది. రుద్రాణి కోపంగా లేవడంతో..వేడి సాంబార్ పోసి చంపేస్తా అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి కోడలిగా కడుపుకి ఇంత అన్నం తినేలా చేయాలి కానీ ఇలా ఆస్తికోసం రుద్రాణిలాంటివాళ్లని ఎగదోయకూడదు అంటుంది
6/11

స్వప్న, ప్రకాశం కూడా ధాన్యలక్ష్మి, రుద్రాణికి గడ్డిపెడతారు. అసలు నీకేంటి సంబందం అని కావ్యను నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. ఆ మాట ఎలా అంటున్నావ్ అంటూ ఫైర్ అవుతుంది అపర్ణ. నేను ఇంటికి ఎలా పెద్దకోడలిగా వచ్చానో తనూ అలాగే వచ్చింది. దిక్కులేని వాళ్లు మా మావయ్య పంచనచేరిన వాళ్లతో మాట్లాడిస్తావేంటి అని ఫైర్ అవుతుంది
7/11

image 7
8/11

వదినా మర్యాద అని రుద్రాణి అంటే..నీకు మర్యాద ఇచ్చేదేంటే?...నీకు అన్నం పెట్టిన మనిషి చావుబతుకుల్లో ఉంటే చెంచాగిరి చేస్తున్నావ్, ఎంత కమిషన్ కు ఒప్పందం కుదుర్చుకున్నావ్ అని ఫైర్ అవుతుంది. అయినా కావ్య జోక్యం చేసుకోవడం ఏంటని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి.
9/11

పుట్టింట్లో గతిలేక ఇక్కడ బతకమని మావయ్య తీసుకొచ్చారని కావ్యను అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. నేను నా కోడలు ఇంట్లో లేకపోతే ఇంటి పెద్ద దిక్కుకు అన్నం పెట్టలేని నువ్వు ఆస్తి విషయం వచ్చేసరికి మాట్లాడుతున్నావ్ అంటుంది.ఇంతలో స్వప్న రియాక్టై.. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా..మీరు పుట్టింటికి వెళ్లలేదు అంత గతిలేనివాళ్లా అంటుంది.
10/11

స్వప్న అన్నదాంట్లో తప్పేముంది...నీ పుట్టింటివాళ్లు ఏనాడైనా నా తమ్ముడిని పండగకు అయినా పిలిచారా? నా కోడలి పుట్టింటి గురించి అనే హక్కు నీకు ఎక్కడిదని నిలదీస్తాడు. ఇదంతా ఎందుకు..ఆస్తి విషయం తేల్చండంటుంది ధాన్యలక్ష్మి. అసలేం జరుగుతోందని మండి పడుతుంది ఇందిరాదేవి.
11/11

బ్రహ్మముడి డిసెంబరు 08 ఎపిసోడ్ లో కావ్యకు పరీక్ష ఎదురుకానుంది. ఆస్తులకోసం కొట్టుకు చచ్చేవాళ్లతో కలసి ఉండేకన్నా పంచి ఇవ్వడమే మంచిదంటాడు సుభాష్. రేపే లాయర్ ని పిలిచి వాటాలు పంచిస్తాను అంటాడు సుభాష్. కావ్య షాక్ అవుతుంది...( అంతా కలసి ఉండేలా చేస్తానని మాటిచ్చింది కదా)
Published at : 07 Dec 2024 10:07 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
గాసిప్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion