అన్వేషించండి
Rashmika Mandanna : రష్మిక మందన్న డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. కాలు నొప్పితోనే ఛావా ట్రైలర్ లాంచ్‌కి వెళ్లిన బ్యూటీ
Rashmika Mandanna Latest Photos : రష్మిక మందన్న డెడికేషన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తీవ్రమైన కాలు నొప్పితో ఇబ్బంది పడుతూ కూడా సినిమా కోసం ఎఫెర్ట్స్ పెడుతోంది హీరోయిన్.

ఛావా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మందన్న, హెల్ప్ చేస్తున్న విక్కీ కౌశల్
1/8

రష్మిక మందన్న తీవ్రమైన కాలునొప్పితో ఇబ్బంది పడుతుందని అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్‌లో ఉన్న రష్మిక.. రీసెంట్గా ఎయిర్‌పోర్ట్‌లో కుంటూతు కనిపించింది.
2/8

ఆమె అసిస్టెంట్లు వీల్ చైర్లో తీసుకెళ్లారు. ఇంత నొప్పిలో కూడా రష్మిక వెళ్లింది ఎక్కడికంటే.. ఛావా ట్రైలర్ లాంఛ్ కోసం.
3/8

అటు తెలుగు సినిమాలతో పాటు.. బాలీవుడ్ సినిమాలతోనూ అలరిస్తోంది రష్మిక. తాజాగా విక్కీ కౌశల్‌తో కలిసి ఛావా అనే మూవీ చేసింది రష్మిక. రీసెంట్గా ఈమె లుక్‌ని విడుదల చేసిన మేకర్స్.. ట్రైలర్‌ను విడుదల చేస్తూ.. ఈవెంట్‌ను ఏర్పాటుచేశారు.
4/8

ఛావా ట్రైలర్ లాంచ్ కోసమే రష్మిక కుంటు కుంటూ మరీ ముంబై వెళ్లింది. ఈవెంట్ దగ్గర విక్కీ కౌశల్ రష్మికకు తన హ్యాండ్ ఇచ్చి హెల్ప్ చేశారు. ఈ ఫోటోలో రష్మిక కూడా నొప్పిని నవ్వుతో కవర్ చేసింది.
5/8

ఇంత నొప్పితో కూడా ఈవెంట్‌కి హాజరవడమనేది సినిమాల పట్ల ఆమెకున్న డెడికేషన్ని తెలుపుతుంది. సినిమా చేయడమే కాదు.. దానిని ప్రమోట్ చేసుకోవడంలో కూడా తనవంతు బాధ్యతను తీసుకుంది రష్మిక.
6/8

ఎంత నొప్పితో ఉన్నా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది రష్మిక. విక్కీ కౌశల్ హెల్ప్ చేసినా.. నొప్పిని భరిస్తూ.. సందడి చేసింది. అయితే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా.. మనకిచ్చిన టాస్క్‌ని కంప్లీట్ చేయాలంటే ఇబ్బంది పడినా ట్రై చేయాలనే రూల్‌ని రష్మిక ఫాలో అవుతుంది.
7/8

ఈ ఈవెంట్కోసం రష్మిక రెడ్ కలర్ డ్రెస్ విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్‌తో వచ్చిన డ్రెస్ వేసుకుంది. చెవులకు భారీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో రష్మిక అందంగా కనిపించింది.
8/8

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానుంది.
Published at : 22 Jan 2025 10:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion