అన్వేషించండి
Lok Sabha Election 2024: ముంబైలో ఓటేసిన టాలీవుడ్ హీరోయిన్స్ - లోక్‌సభ ఎన్నికల కోసం తారాలోకం
Tollywood Actress cast their vote in Mumbai: టాలీవుడ్ హీరోయిన్లు చాలా మందికి ఓటు హక్కు ముంబైలో ఉంది. ఇవాళ లోక్‌సభకు జరిగిన ఐదో దశ పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ముంబైలో ఓటేసిన టాలీవుడ్ హీరోయిన్లు
1/9

తమన్నా భాటియా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఆవిడ పంజాబీ అమ్మాయి. అయితే, ముంబైలో సెటిల్ అయ్యారు. తన ఓటు హక్కు అక్కడ వినియోగించుకున్నారు. లోక్ సభ ఐదో దశ పోలింగ్ లో ఆవిడ కనిపించారు.
2/9

తమన్నాతో పాటు శ్రియా శరణ్ కూడా తెలుగులో ఓ వెలుగు వెలిగారు. ఆవిడది ఢిల్లీ. అయితే, ఆమె కూడా ముంబైలో సెటిలయ్యారు. తల్లితో పాటు వచ్చి ఓటు వేశారు. హిందీలోనూ శ్రియ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
3/9

'దేశముదురు' సినిమాతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక సైతం ముంబైలో ఉంటున్నారు. ఆవిడ తన ఓటు హక్కు అక్కడ వినియోగించుకున్నారు.
4/9

శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. శ్రీదేవిది చెన్నై అయితే హీరోయిన్ గా హిందీ సినిమాలు చేసి, బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలయ్యారు. అందువల్ల, జాన్వీకి ముంబైలో ఓటు హక్కు వచ్చింది. 'దేవర'తో ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే.
5/9

ముంబైలో సెటిలైన మలయాళీ విద్యా బాలన్. తెలుగులో బాలకృష్ణకు జోడిగా ఎన్టీఆర్ బయోపిక్ చేశారు. లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ఆవిడ కూడా ఓటు వేశారు.
6/9

పవన్ కల్యాణ్ 'తీన్ మార్', రామ్ 'ఒంగోలు గిత్త' సినిమాల్లో నటించిన హీరోయిన్ కృతి కర్బందా. ఆవిడది బెంగళూరు. అయితే, ముంబైలో సెటిలయ్యారు. అక్కడ ఓటు నమోదు చేసుకున్నారు. అక్కడ తన ఓటు వేశారు.
7/9

హైదరాబాదీ అమ్మాయి, ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తూ ముంబైలో సెటిలైన హీరోయిన్ టబు. ఆమె బాధ్యతగా తన ఓటు వేశారు.
8/9

ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ హీరోయిన్, నటి రేఖ
9/9

ఓటు వేసిన అనంతరం తన వేలిపై సిరా చుక్క చూపిస్తున్న హిందీ హీరోయిన్ సాన్యా మల్హోత్రా
Published at : 20 May 2024 06:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion