అన్వేషించండి
Manchu Manoj: మంచు మనోజ్ కామెంట్స్‌తో హైలైట్ అయిన 'జగన్నాథ్' - అసలు ఆ సినిమా గురించి తెలుసా?
చెట్టు పేరు చెప్పుకొని అమ్ముకోవడానికి నేను కాయో పండో కాదని మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దాంతో అసలు ఏ ఈవెంట్ లో ఆయన కామెంట్ చేశారని ఆరా తీయడంతో 'జగన్నాథ్' సినిమా హైలైట్ అవుతోంది.
మంచు మనోజ్ కామెంట్స్‌తో హైలైట్ అయిన 'జగన్నాథ్' - అసలు ఆ సినిమా గురించి తెలుసా?
1/5

రాయలసీమ భరత్ హీరోగా నటిస్తున్న సినిమా 'జగన్నాథ్'. ఇందులో ప్రీతి హీరోయిన్. దీనికి ఇద్దరు దర్శకులు... భరత్, సంతోష్. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం మీద పీలం పురుషోత్తం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
2/5

మంచు మనోజ్ ముఖ్య అతిథిగా 'జగన్నాథ్' సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఆ ఈవెంట్ లో తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది తనను తొక్కాలని చూసినా, తనపై బురద చల్లాలని ఆలోచించినా, ఆ నాలుగు గోడల మధ్యకు తనను రానివ్వకుండా చేసినా సరే తనను జనాల గుండెల్లోంచి తీసేయలేరని మనోజ్ కామెంట్ చేశారు. తనను తొక్కలన్నా, లేపాలన్నా అది అభిమానుల వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు.
Published at : 15 Feb 2025 08:28 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















