అన్వేషించండి
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లంకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
Bhairavam Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె అదితి జంటగా నటిస్తున్న సినిమా 'భైరవం'. ఇందులో నారా రోహిత్, మనోజ్ మంచు సైతం నటిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ ఏమిటంటే?

పాలకొల్లులో దర్శకుడు విజయ్ కనకమేడలతో 'భైరవం'లో జంటగా నటిస్తున్న అదితి శంకర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్
1/4

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ జంటగా నటిస్తున్న సినిమా 'భైరవం'. ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్ మరో ఇద్దరు హీరోలు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకం మీద కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రమిది. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పకులు. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
2/4

'భైరవం' సినిమా కోసం బెల్లకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ మీద పాలకొల్లులో క్యూట్ లవ్ సాంగ్ ఒకటి తెరకెక్కిస్తున్నారు. ఆ పాటకు విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల చార్ట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారని యూనిట్ అంటోంది.
3/4

'భైరవం' సాంగ్ షూటింగ్ నుంచి ఫిలిం మేకర్ రిలీజ్ చేసి స్టిల్స్ చూస్తే... హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుంగీ కట్టుకుని షేడ్స్ పెట్టుకుని రగ్గడ్ అండ్ మ్యాసీ అవాతర్‌లో కనిపించారు. హీరోయిన్ అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీలో ఆకట్టుకున్నారు.
4/4

క్రిస్మస్ సీజన్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానున్న 'భైరవం' సినిమాలో అదితితో పాటు దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
Published at : 21 Nov 2024 08:33 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion