Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
Amma Rajasekhar's Thala Review: తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా 'తల'. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.

Amma Ragin Raj's Thala Review in Telugu: 'రణం' వంటి సూపర్ హిట్ సినిమాతో కొరియోగ్రాఫర్ 'అమ్మ' రాజశేఖర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రవితేజతో 'ఖతర్నాక్' తీశారు. కొంత విరామం తర్వాత తనయుడు అమ్మ రాగిన్ రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'తల' సినిమాకు దర్శకత్వం వహించారు. దీప ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో అంకిత నస్కర్ హీరోయిన్. '6 టీన్స్' ఫేమ్ రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, 'సత్యం' రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర ప్రధాన తారాగణం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
'తల' సినిమా కథ ఏమిటంటే?
హీరో (అమ్మ రాగిన్ రాజ్) తల్లిదండ్రులది ప్రేమ వివాహం. అయితే అతని తండ్రి కుటుంబానికి దూరమవుతాడు. తల్లి దగ్గరే పెరుగుతాడు. తల్లి అనారోగ్యం పాలవడంతో ఎలాగైనా తండ్రిని తీసుకురావాలని ఆయన్ను వెతుకుతూ వెళతాడు. ఆ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ప్రయాణంలో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడడానికి కారణం ఏమిటి? అతనికి తండ్రి ఎక్కడ దొరికాడు? తండ్రి సమస్యలో ఉన్నాడని తెలుసుకున్న తనయుడు దానిని పరిష్కరించగలిగాడా? లేదా? తండ్రి సమస్యను తీర్చి తల్లిదండ్రులను దగ్గరకు చేయగలిగాడా? లేదా? జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది సినిమా.
అమ్మ రాగిన్ రాజ్ ఎలా చేశాడు?
అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ ఎలా ఉంది?
తనయుడిని మాస్ హీరో చేయాలనే అమ్మ రాజశేఖర్ ప్రయత్నం ప్రతి యాక్షన్ సన్నివేశంలో కనిపించింది. కమర్షియల్ హంగులతో కూడిన కథను ఆయన ఎంపిక చేసుకున్నారు. సీజనల్ క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకున్నారు. వాళ్లందరి మధ్య హీరో అనుభవం తక్కువ. యాక్షన్ సన్నివేశాల్లో వయలెన్స్ ఎక్కువ. దాంతో అమ్మ రాగిన్ రాజ్ తన వయసుకు మించిన బరువైన పాత్రను పోషించారు. మొదటి సినిమా అయినా సరే చక్కగా నటించారు. అమ్మ రాగిన్ రాజ్ నటనలో ఒక ఇంటెన్స్ ఉంది. రూరల్ మాస్ కథలకు సెట్ అయ్యే ఫేస్ కట్ ఉంది. కాన్సంట్రేట్ చేస్తే, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు ఇంకాస్త జాగ్రత్త పడితే మంచి నటుడు అవుతాడు.
హీరో తల్లిదండ్రులుగా రోహిత్, ఎస్తర్ డిఫరెంట్ రోల్స్ చేశారు. ఇక మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే... అజయ్ సత్యం రాజేష్ ముక్కు అవినాష్ రాజీవ్ కనకాల తదితరులవి రొటీన్ క్యారెక్టర్లు. తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. అకాక సన్నివేశాలలో ఇంద్రజ నటన ఆకట్టుకుంటుంది.
అమ్మ రాజశేఖర్ ఈ కథను స్టార్ హీరోతో తీసినట్లైతే ఆయనకు బడ్జెట్ ఇంకా వచ్చేది. గ్రాండ్ స్కేల్లో తీయడానికి వీలుపడేది. కథలో మదర్ సెంటిమెంట్ ఉంది. యాక్షన్ మీద పెట్టిన దృష్టి ఆ సీన్స్ బాగా తీయడంలో పెట్టలేదు. కొత్త హీరో కావడం వల్ల కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారు. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ఒక మాస్ ఫీల్ సెట్ చేస్తే... యాక్షన్స్ సన్నివేశాలలో వయలెన్స్ డిఫరెంట్ ఫీల్ ఇచ్చింది. అందుకు తగ్గ ఆర్ఆర్ ఇవ్వడంలో అస్లాం కేఈ ఫెయిల్ అయ్యారు. రాగిన్ రాజ్ వయసుకు మించిన వయలెన్స్ సన్నివేశాలు సైతం సినిమాలో ఉన్నాయి. అందువల్ల యాక్షన్ ప్రేమికులకు మాత్రమే సినిమా నచ్చుతుంది
నటుడిగా తనయుడి టాలెంట్ అందరికీ చూపించేలా సినిమా తీయడంలో అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారు. రూరల్ మాస్ సినిమాలు, రా అండ్ రెస్టిక్ బ్యాక్ డ్రాప్ లో కథలకు రాగిన్ రాజ్ సెట్.
Also Read: 'ఛావా' రివ్యూ: శివాజీ తనయుడు శంభాజీ సింహగర్జన... దేశభక్తులకు పూనకాలే, మరి ప్రేక్షకులకు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

