Trump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP Desam
డొనాల్డ్ ట్రంప్ అమెరికా కు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మోదీకి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అద్భుతమైన స్వాగతాన్ని అందించింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సహా తన మంత్రి వర్గంలోని కీలక వ్యక్తులతో కలిసి ట్రంప్ మోదీకి స్వాగతం పలికారు. మోదీ ట్రంప్ ను చూడగానే హౌ ఆర్ యూ అంటూ పలకరిస్తే అందుకు బదులుగా మోదీని హగ్ చేసుకున్న ట్రంప్...మిమ్మల్ని చాలా మిస్ అయ్యామంటూ నవ్వుతూ బదులిచ్చారు. వాస్తవానికి 2019లో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ను మరోసారి గెలిపించాలని మోదీ ఏకంగా అమెరికాలోనే హౌడీ మోడీ అనే సభ పెట్టారు. ఇది అప్పట్లో పెను సంచలనం రేపగా అమెరికన్లు మాత్రం డెమొక్రాట్లకే ఓటు వేయటంతో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు తన మూడో ప్రయత్నంలో మళ్లీ రెండోసారి ట్రంప్ అధ్యక్షుడు అవ్వటంతో ఈ ఇద్దరి దోస్తీ మళ్లీ మొదలైందన్నమాట. అందుకే ట్రంప్ అంత ఎమోషనల్ గా కనిపించారు మోదీని చూడగానే.





















