Balakrishna Thaman: తమన్‌కు పోర్షే గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ... ఆ కారు రేటు ఎన్ని కోట్లు ఉందో తెల్సా?
Balakrishna and Thaman movies: నట సింహం నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు తమ మధ్య అనుబంధం గురించి ప్రేక్షకులందరికీ తెలుసు. తమన్ అంటే తనకు ఎంత ఇష్టమనేది బాలకృష్ణ మరోసారి చూపించారు.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) మీద సంగీత దర్శకుడు తమన్ (Thaman)కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. బాలయ్య సినిమాలకు ఆయన అందించే సంగీతంలో ఆ అభిమానం, ప్రేమ కనిపిస్తాయి. అటు బాలకృష్ణకూ అంతే! తమన్ అంటే ఇష్టం. ఇటీవల ఎన్.బి.కె తమన్ అని నామకరణం కూడా చేశారు. ఇప్పుడు మరొకసారి తమన్ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు బాలకృష్ణ.
రెండు కోట్లు విలువచేసే కారు బహుమతిగా!
బాలకృష్ణ నుంచి తమన్ విలువైన బహుమతి అందుకున్నారు. రెండు కోట్ల రూపాయల విలువ చేసే పోర్షే కారు ఇచ్చారు బాలకృష్ణ. కారును తీసుకు వెళ్లి తమన్‌కు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. అక్షింతలు వేసి సంగీత దర్శకుడిగా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు.
First time in history oka hero music director ki Car Gift evvadam ❤️
— NBK Cult 🦁 (@iam_NBKCult) February 15, 2025
Gold hearted Balayya ❤️
Their bond keeps growing showing that respect and admiration go beyond movies 🫶🏻#PadmabhushanNBK #Akhanda2@musicthaman #NandamuriBalakrishna pic.twitter.com/gGQhN8dHsX
కారు ఎందుకు? తమన్ మీద ఎందుకు అంత ప్రేమ?
భారీ విజయాలు వచ్చిన తర్వాత దర్శకులకు నిర్మాతలు ఖరీదైన బహుమతులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే, సంగీత దర్శకులకు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. మరి, తమన్‌కు కారు ఎందుకు ఇచ్చారు? తమన్ మీద బాలకృష్ణకు ఎందుకు అంత ప్రేమ? అని కొంత మంది మదిలో ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు.
ఇటీవల బాలకృష్ణ, తమన్ కలయికలో వచ్చిన సినిమాలు అన్నీ భారీ విజయాలు సాధించాయి. వెండితెరపై బాలకృష్ణ హీరోయిజాన్ని తమన్ తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేస్తున్నారు. మరో స్థాయికి తీసుకు వెళుతున్నారు. 'డిక్టేటర్'తో వాళ్లిద్దరి కాంబినేషన్ మొదలైంది. అయితే... 'అఖండ'తో భారీ హిట్ అందుకున్నారు. బాక్సులు బద్దలయ్యే ఆర్ఆర్ ఇచ్చారు తమన్. 'వీర సింహా రెడ్డి', 'డాకు మహారాజ్' విజయాల్లోనూ తమన్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోసం నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ ఫ్రీగా చేశారు తమన్. బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న 'అఖండ 2'కూ ఆయనే సంగీత దర్శకుడు.





















