అన్వేషించండి
Yanam Flowers Show 2025: పుష్ప-2లో ఎడ్ల బండి సీన్‌ను పూలతో తీర్చిదిద్దారు! ఎక్కడంటే?
Yanam Flower Show:రెండెడ్ల బండి తోలుతున్న రైతు.. గుర్రపు బండిపై జమిందారు స్వారీ.. రెక్కలు విచ్చుకుని చూస్తోన్న డాల్ఫిన్‌లు.. ఇలా సహజ సిద్ధంగా పూచిన పూలతో తీర్చిదిద్దిన కళాకృతులు యానాంలో ఆకట్టుకున్నాయి

యానాం పూల ప్రదర్శన
1/18

యానంలో సహజమైన పూలతో రెండెడ్ల బండిని తోలుతున్న రైతు ఆకారం ఆకట్టుకుంది.
2/18

మాతృప్రేమకు అద్దంపట్టేలా సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ఆవు దూడ ప్రతిరూపం.
3/18

దేశ విదేశాలనుంచి తెచ్చి అందంగా అలంకరించిన పువ్వులు.. విభిన్న రకాల జాతులకు చెందిన పండ్లు అమితంగా ఆకట్టుకున్నాయి.
4/18

పుష్ప సినిమాలో వినియోగించిన ఎర్ర చందనం దుంగలను మోస్తున్నట్లుగా రెండెడ్ల బండి సోయగం మరింత అందంగా ఉంది.
5/18

సహజమైన పూలతో గుర్రపు బండిపై స్వారీ చేస్తున్న జమిందారు కళాకృతి అబ్బుర పరుస్తోంది.
6/18

రెక్కలు విచ్చుకుని చూస్తోన్న డాల్ఫిన్ కళాకృతిని సహజమైన పూల సిద్ధం చేశారు.
7/18

ఐ లవ్ యూ యానాం అంటూ గులాబీలతో అలంకరించిన లోగో ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి.
8/18

యానాంలో ఆకట్టుకున్న పూల ప్రదర్శన
9/18

యానాంలో ఆకట్టుకున్న పూల ప్రదర్శన
10/18

సంక్రాంతి సందర్భంగా యానాంలో ఈ ప్రత్యేక ఆకర్షణలు మూడు రోజుల పాటు కనువిందు చేశాయి.
11/18

తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పురస్కరించుకుని యానాంలో 21వ ప్రజాఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
12/18

పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సారథ్యంలో జరిగిందీ కార్యక్రమం
13/18

ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగసామి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ హాజరయ్యారు.
14/18

యానాం ప్రజలే కాకుండా అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు.
15/18

ప్రత్యేక ఆకర్షణగా 23వ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ షో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
16/18

యానాంను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు.
17/18

దేశ విదేశాలనుంచి కళాకారులను రప్పించి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తులో నిర్వహించారు.
18/18

సంస్కృతి, సాంప్రదాయాలు ప్రజలకు గుర్తుచేసేందుకు యానాంలో ప్రజా ఉత్సవాలు భారీగా నిర్వహిస్తున్నట్లు పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్షారావుతెలిపారు.
Published at : 10 Jan 2025 08:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion