అన్వేషించండి
Pawan Kalyan - Ram Charan: బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో హైలైట్ మిస్ అవ్వొద్దు
రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందులో బాబాయ్ పవన్ కళ్యాణ్ - అబ్బాయి రామ్ చరణ్ మధ్య బాండింగ్ హైలైట్ అయింది. వాళ్ళిద్దరి అఫెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

'గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్'లో బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా
1/5

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బంగారం లాంటి వ్యక్తి అని ఎదిగి కొద్ది ఒదిగి ఉంటాడని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రిలో శనివారం రాత్రి జరిగిన 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ వేడుకలో అబ్బాయి మీద బాబాయ్ ప్రశంసల వర్షం కురిపించారు.
2/5

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ - చరణ్ మధ్య అనుబంధం హైలైట్ అయింది. రామ్ చరణ్ అంటే రాముని చరణాల వద్ద ఉండే ఆంజనేయుడు అని, నాన్నగారు ఆ పేరు పెట్టారని, పేరుకు తగ్గట్టు ఎంత బలవంతుడైనా వినయ విధేయతలతో రామ్ చరణ్ ఉంటాడని పవన్ తెలిపారు.
3/5

ఏపీలో మాత్రమే కాదని ఇండియన్ పాలిటిక్స్ (భారత రాజకీయాలలో) నంబర్ వన్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని బాబాయ్ గురించి చెప్పారు రామ్ చరణ్.
4/5

తన సినిమాల గురించి ఎప్పుడూ చెప్పని పవన్... 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
5/5

రామ్ చరణ్ హీరోలు అందరికీ స్నేహితుడని, ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల లేదా ఆంజనేయస్వామి మాలలో ఉంటాడని, ఆస్కార్ వరకు వెళ్ళినా ఒదిగి ఉండడం చరణ్ తత్వమని పవన్ తెలిపారు.
Published at : 05 Jan 2025 09:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
లైఫ్‌స్టైల్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion