UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచింది. తాజాగా మరో కీలక వాగ్దానం చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ హమీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు వాగ్దానాలు చేసిన హస్తం పార్టీ తాజాగా మరో వాగ్దానం చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజలందరికీ రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చారు.
యూపీలో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్, వైరల్ ఫీవర్ల ధాటికి ఈ పరిస్థితులు మరింత దిగజారాయని ట్వీట్ చేశారు.
कोरोना काल में और अभी प्रदेश में फैले बुखार में सरकारी उपेक्षा के चलते उप्र की स्वास्थ्य व्यवस्था की जर्जर हालत सबने देखी।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2021
सस्ते व अच्छे इलाज के लिए घोषणापत्र समिति की सहमति से यूपी कांग्रेस ने निर्णय लिया है कि सरकार बनने पर
'कोई भी हो बीमारी
मुफ्त होगा 10 लाख तक इलाज सरकारी।' pic.twitter.com/wJbTZXbjmk
ఇందుకోసమే అత్యంత తక్కువ డబ్బులతో అద్భుతమైన చికిత్స అందించేందుకే ఈ ఉచిత వైద్యం హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. రూ.10 లక్షల చికిత్స వరకు ఎలాంటి డబ్బు కట్టక్కర్లేదన్నారు.
యూపీలోని బారబంకీ జిల్లాలో శనివారం ప్రతిజ్ఞ యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. నవంబర్ 1 వరకు ఈ పర్యటన జరగనుంది.
ఇవే హామీలు..
- అన్నదాతల రుణాల మాఫీ సహా వరి, గోధుమకు రూ. 2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.
- రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
- కరోనా సంక్షోభం వల్ల ఎదురైన నష్టం నుంచి బయటపడేందుకు ఒక్కో పేద కుటుంబానికి రూ. 25 వేలు అందిస్తామని చెప్పారు.
- విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్నారు.
- బాలికలకు ఉచిత ఈ-స్కూటీ, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు