Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

కరోనా వల్ల భారీగా దెబ్బతిన్న దేశాల్లో మనదేశం కూడా ఒకటి. ఓ తాజా పరిశోధనలో ప్రజల ఆయుర్ధాయంపై కరోనా ప్రభావం చూపినట్టు తేలింది.

FOLLOW US: 

కరోనా కల్లోలంలో మన దేశం ఏడాదిన్నర పాటు ఎలా విలవిలలాడిందో అందరికీ తెలిసిందే.  వ్యాక్సినేషన్ ప్రకియ ఊపందుకున్నాక కాస్త తెరిపిపడ్డామంతా. ఇంకా ఏదో మూల మూడో వేవ్ ముప్పు తొలుస్తూనే ఉంది. కాగా కరోనా మనుషుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకోవడం కోసం ముంబైలోని డియోనార్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూబ్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ (ఐఐపీఎస్) శాస్త్రవేత్తలు ఓ పరిశోధన నిర్వహించారు. అందులో భారతీయ ప్రజలను కాస్త కలవరపెట్టే అంశాలే వెలుగులోకి వచ్చాయి. 

అధ్యయనం ప్రకారం 2019 వరకు పురుషుల ఆయుర్ధాయం 69.5 సంవత్సరాలుగా, మహిళల ఆయుర్ధాయం 72 సంవత్సరాలుగా ఉంది. అయితే కరోనా ఎంట్రీ ఇచ్చాక మాత్రం పురుషుల ఆయుర్ధాయం 67.5 సంవత్సరాలుగా, స్త్రీలది 69.8 సంవత్సరాలుగా తేలింది. దీంతో కనీసం రెండు సంవత్సరాల ఆయుర్ధాయం తగ్గినట్టు బయటపడింది. ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ చేసిన పరిశోధన ‘బీఎమ్‌సీ పబ్లిక్ హెల్త్’ అనే మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. అందులో కరోనా కారణంగా 35-69 మధ్య వయస్సులో ఉన్న పురుషులు అధికంగా మరణించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆ ఏజ్ గ్రూప్ వారి జనాభా  అధికంగా పడిపోవడానికి కరోనాయే కారణమని తెలిపారు. అంతేకాదు గత దశాబ్ధ కాలంగా మనుషుల ఆయుర్ధాయాన్ని పెంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను, సాధించిన పురోగతిని కరోనా తుడిచిపెట్టేసిందని అభిప్రాయపడ్డారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2020 మార్చి నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల నాలుగున్నర లక్షల మంది మరణించారు. కానీ అనధికారికంగా ఆ లెక్క మరింత ఎక్కువగా ఉంటుందని డేటా నిపుణులు సూచిస్తున్నారు. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?

Also read: సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రైస్‌తో బరువు తగ్గే ఛాన్స్... నిజమేనా?

Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి

Also read: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Oct 2021 10:05 AM (IST) Tags: corona virus New study COVID-19 pandemic life expectancy

సంబంధిత కథనాలు

BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...

BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...

Oats Recipe: పోషకాల పుట్ట ఓట్స్ ఆమ్లెట్, ఎలా చేయాలంటే

Oats Recipe: పోషకాల పుట్ట ఓట్స్ ఆమ్లెట్, ఎలా చేయాలంటే

Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం

Eye Problems: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!

Eye Problems: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!

టాప్ స్టోరీస్

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్