Breakfast: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి
ఉదయం తినే టిఫిన్ ను చాలా మంది తక్కువ అంచనా వేస్తారు కానీ, అదే రోజులో చాలా ముఖ్యమైనది.
ఉదయాన్నే అల్పాహారం మానేసి, నేరుగా లంచ్ చేసే వాళ్లు ఎంతో మంది. కానీ వైద్యులు చెబుతున్నదాని ప్రకారం ఉదయాన టిఫిన్ టైమ్ ను స్కిప్ చేయకండి. కచ్చితంగా ఏదోఒకటి పొట్ట నిండుగా తినండి. అదే మీ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది. ఉదయం మీరు తినే ఆహారమే ఆ రోజంతా మీలో శక్తి తగ్గకుండా కాపాడుతుంది. అయితే ఎలాంటివి తినకూడదు? అనే అంశంపై ఆరోగ్యనిపుణులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
1. ఉదయాన తీపి పదార్థాల జోలికి వెళ్లకండి. టిఫిన్ రూపంలో తీయగా ఉండే ఆహారం తింటే రోజంతా మగతగా అనిపిస్తుంది. అంతేకాదు ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. ఆకలి త్వరగా వేస్తుంది. ఏదైనా తినాలనిపించి అధికంగా లాగించేస్తాం కూడా. దీనివల్ల బరువు పెరిగే సమస్య మొదలవ్వచ్చు.
2. టిఫిన్ అనగానే ఏదో ఒకటి తింటే సరిపోతుందనుకునేవారే ఎక్కువ. ఓ ఆపిల్ లేదా అరటిపండో తినేసి సరిపెట్టేసుకుంటారు. దీని వల్ల శరీరం నీరసించి పోతుంది. అంతేకాదు లంచ్ టైమ్ లో అవసరానికి మించి అధికంగా తినేస్తారు. దీనివల్ల కొవ్వు పేరుకుపోవచ్చు. కాబట్టి ఒక పండు, కాయతో సరిపెట్టకుండా కాస్త పుష్టిగా టిఫిన్ చేయండి.
3. చాలా మంది లేచిన వెంటనే కాఫీ, టీలు తాగుతుంటారు. ఇది మంచిది కాదు. శరీరంలో ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇడ్లీయో, దోశ, ఉప్మా.. ఇలా ఏదో ఒక టిఫిన్ తిన్నాక వాటిని తాగండి.
4. ఆరెంజ్ జ్యూస్ శరీరానికి చాలా మంచిదే. అందుకే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ సమయంలో గ్లాసుడు జ్యూసు తాగేస్తారు. కానీ అది మీరు ఇంట్లో తాజాగా తయారుచేసుకున్నదైతేనే మేలు. సూపర్ మార్కెట్లలో దొరికే ప్యాకేజ్డ్ ఉత్పత్తి అయితే అధికంగా చక్కెర ఉండే అవకాశం ఉంది. దీని వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది.
5. త్వరగా తినేయచ్చు, వండుకోవాల్సిన కష్టం ఉండదనుకుని చాలా మంది డోనట్స్, ఎగ్ పఫ్, వంటివి ఫ్రిజ్ లో దాచుకుని, బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో వేడి చేసుకుని తినేస్తుంటారు. ఇలా చేస్తే అతి త్వరగా మీరు బరువు పెరగడం ఖాయం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం
Also read: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి