Beauty: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?
కొరియన్ అమ్మాయిలు స్లిమ్ గా ఉండటానికి కారణం వారు తీసుకునే డైట్. వారు ఎలాంటి డైట్ తీసుకుంటారో తెలుసా?
మనదేశంలో కొరియన్ సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్ లు చూసేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అవి చూస్తున్నప్పుడు మీకు అనిపించే ఉంటుంది... వీరంతా సన్నగా, ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అని. ఊబకాయంతో కనిపించే కొరియన్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కొరియన్ మహిళల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీరి శరీరాకృతి ఎంతో మందిలో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగించింది. కొరియన్ మహిళలు సన్నగా ఉండేందుకు వీరు ఏం తింటారో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. సమతులాహారం తింటారు
కొరియన్ మహిళల ఆహారం సమతులంగా ఉంటుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల నుంచి కొవ్వు వరకు కొరియన్ల ఆహారంలో అన్ని ఉంటాయి. అతిగా తినరు. చిన్నచిన్న మీల్స్ రూపంలో తీసుకుంటారు. పొట్టనిండా తిని కూర్చోవడం, నిద్రపోవడం వంటివి చేయరు.
2. కూరగాయలే ప్రధానం
మీరు ఎప్పుడైనా కొరియన్ వంటకాలను పరిశీలించండి. అధికంగా కూరగాయలే కనిపిస్తాయి. కూరగాయలలో పీచు, తక్కువకేలరీలు ఉంటాయి. కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు. అందులోనూ ఆయిల్ లో అధికంగా డీప్ ఫ్రై చేసిన కూరగాయలు కావవి. కాబట్టి అధికకేలరీలు కూడా శరీరంలో చేరవు.
3. పులియబెట్టిన పచ్చళ్లు, ఆహారాలే ముఖ్యం
కిమ్చి అని పిలిచే పులియబెట్టిన పచ్చళ్లను కచ్చితంగా కొరియన్ మహిళలు తింటారు. అది లేకుండా వారి భోజనం పూర్తి కాదు. ఈ కిమ్చి ప్రేగులు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
4. ఇంటి ఆహారానికే ప్రాధాన్యత
ఇంట్లో తయారుచేసుకున్న ఆహారానికే కొరియన్ మహిళలు ప్రాధాన్యతనిస్తారు. ప్రాసెస్ చేసే ఆహారానికి, ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉంటారు.
5. అధికంగా సీ ఫుడ్
చేపలలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అందుకే వీరు కొవ్వు ఉండే చేపలను అధికంగా తింటారు. కొవ్వులోనే కదా ఆమ్లాలు దొరికేది. అలాగే సీ వీడ్ అంటే సముద్రపు నాచు మొక్కల్ని కూడా తింటారు. విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే సీవీడ్‌లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు గొప్పగా సహకరిస్తుంది.
6. కిలోమీటర్ల కొద్దీ నడక
కొరియన్ మహిళలు నడకకు అధిక ప్రాధాన్యతనిస్తారు. రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసులకు నడుచుకుని వెళ్లేందుకే ఇష్టత చూపిస్తారు. ఇది వారి చురుకైన జీవనశైలికి నిదర్శనం. అందుకే అధిక బరువు పెరగడం లాంటి సమస్యలు వారి దరి చేరవు.
అయితే అనారోగ్యాల కారణంగా, వారు వాడే మందుల సైడ్ ఎఫెక్టుల కారణంగా ఊబకాయం బారిన పడిన వారూ ఉన్నారు. కానీ వారి సంఖ్యా చాలా తక్కువే.
Also read: అతిగా తాగుతున్నారా... ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ డామేజ్ అయినట్టే
Also read: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి