అన్వేషించండి
Love at First Sight : మొదటి చూపులోనే ప్రేమ పుడుతుందా? మీ బాడీలో ఈ రియాక్షన్స్ జరిగాయా?
Brain Chemistry Behind Instant Attraction : చాలామంది మొదటి చూపులోనే ప్రేమ గురించి చెబుతుంటారు. అయితే దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందంటారు. దానివల్లే ఈ ఫీలింగ్ వస్తుందట.
ఒకరిని చూసిన వెంటనే ప్రేమ ఎలా పుడుతుంది?
1/6

మొదటి చూపులో ప్రేమ పుడుతుందా అంటే.. ఏ వ్యక్తిని అయినా చూసినప్పుడు.. క్షణంలో మెదడు రివార్డ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. డోపమైన్ సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా చాలా ఆనందం, సాన్నిహిత్యాన్ని పొందే ప్రేరణ పెరుగుతుంది. ఆక్సిటోసిన్ నమ్మకాన్ని పెంచుతుంది. అదే సమయంలో సెరోటోనిన్ స్థాయి తగ్గుతుంది.
2/6

డోపమైన్ అనేది ఉత్సాహానికి కారణం అవుతుంది. అనుకోని ఎనర్జీ, ఆకర్షణ, భావన.. ఆ వ్యక్తి గురించి మరింత తెలుసుకోవాలనే కోరికను పెంచుతుంది.
3/6

ఆకర్షణ ప్రారంభ క్షణాల్లో కూడా ఆక్సిటోసిన్ భావోద్వేగ బంధాన్ని ఏర్పరచడం ప్రారంభిస్తుంది. ఇది సాధారణంగా చాలా కాలం ప్రేమతో ముడిపడి ఉంటుంది. కానీ ఇది త్వరగా విడుదల కావడం వల్ల సురక్షితంగా, సౌకర్యంగా భావిస్తారు. దీనివల్ల అప్పుడే చూసిన వ్యక్తి పట్ల విచిత్రంగా ఆకర్షితులవుతారు.
4/6

సెరోటోనిన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల కొంచెం ఉన్మాదం కలుగుతుంది. దీని తరువాత మనసు పదేపదే అదే వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఆ మొదటి క్షణాలను పదే పదే గుర్తు చేసుకుంటారు. ఇప్పుడే కలిసిన వ్యక్తి అయినా వారి గురించి ఆలోచించడం ఆపలేదు.
5/6

శరీరం ఆకర్షణకు ప్రతిస్పందిస్తూ.. అడ్రినాలిన్, నార్‌అడ్రినాలిన్‌లను విడుదల చేస్తుంది. దీని తరువాత గుండె వేగం పెరగడం, అరచేతుల్లో చెమటలు పట్టడం, కొంచెం వణుకు, అలెర్ట్ అవ్వడం పెరుగుతాయి.
6/6

అత్యంత సాధారణంగా కనిపించే ప్రతిస్పందనలలో ఒకటి కనుపాపలు పెద్దవి కావడం. ఎవరైనా ఆకర్షణీయంగా భావించే వ్యక్తిని చూసినప్పుడు.. వారి కనుపాపలు వాటంతట అవే పెద్దవిగా అవుతాయి.
Published at : 09 Dec 2025 11:10 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















