Basmati Rice: సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రైస్‌తో బరువు తగ్గే ఛాన్స్... నిజమేనా?
బాస్మతి బియ్యం అంటే మనకు తెలిసినంత వరకు బిర్యానీ మాత్రమే వండుకుంటాం. కానీ వాటిని రోజూ తిన్నా మంచిదే.
బిర్యానీ వండితే బాస్మతి బియ్యంతోనే వండాలి, ఆ సువాసన, రుచి కేవలం ఆ బియ్యంతోనే వస్తాయి. నిజమే కానీ బాస్మతి రకం బియ్యం కేవలం బిర్యానీకే పరిమితమా? అంతకుమించి ఆ వాటిగురించి చెప్పుకోవడానికి ఏం లేదా? ఎందుకు లేదు... ఎన్నో పోషకాలున్న బియ్యపు రకం బాస్మతి. కానీ మనం వాటిని బిర్యానీ రైస్ గా ముద్రవేశాం. సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రైస్ మనకెలా మేలుచేస్తుందో నిపుణులు చెబుతున్నారు.
తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్...
గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియని వాళ్లు చాలా మందే ఉంటారు. మనం ఆహారం తిన్న తరువాత అది ఎంత వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తుందో తెలిపేదే గ్లైసీమిక్ ఇండెక్స్. కొన్ని రకాల ఆహారపదార్థాలు అతిత్వరగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తాయి. దీనివల్ల డయాబెటిస్ రోగులు చాలా ఇబ్బంది పడతారు. అందుకోసమే గ్లైసీమిక్ ఇండెక్స్ ప్రకారం ఆహారం 55 పాయింట్ల లోపల ఉంటే తక్కువ గ్లైసీమిక్ ఆహారంగా భావిస్తారు. అంటే డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని పరిమితంగా తినవచ్చు. బాస్మతి రైస్ తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారపదార్థం. కాబట్టి ఈ అన్నాన్ని తిన్నా రక్తంతో చక్కెర నిల్వలు అమాంతం పెరగవు.
అధికంగా ఫైబర్...
ఈ బియ్యంలో అధిక స్థాయిలో ఫైబర్ లభిస్తుంది. సాధారణ బియ్యంతో పోలిస్తే మూడురెట్లు అధికంగా ఉంటుంది ఫైబర్. కాబట్టి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా అధికంగానే ఉంటుంది. వీటి ద్వారా అందే కెలోరీలు కూడా తక్కువే.
బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు సాధారణ బియ్యానికి బదులు బాస్మతి బియ్యాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఇందులో కెలోరీలు తక్కువ. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అయితే బాస్మతి బియ్యంతో రోజూ బిర్యానీ వండుకుని తింటే ఈ లాభాలు కలగవు, సాధారణ తెల్ల అన్నంలా వండుకుని తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు పొందచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం
Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి
Also read: అక్టోబర్ 25 నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి