By: ABP Desam | Updated at : 23 Oct 2021 08:31 AM (IST)
(Image credit: Pixabay)
అమెరికాలో టీవీ ఛానెళ్లు నటీనటులను ఇంటర్య్వూలు చేసినప్పుడు స్నానానికి సంబంధించి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. అందులో కొంతమంది తాము రెండు రోజులకోసారి స్నానం చేస్తామని చెప్పారు. మరికొందరు మూడు రోజులకోసారి స్నానం చేస్తామని తెలిపారు. దీంతో రోజూ స్నానం చేయడం అవసరమా అన్న చర్చ అగ్రరాజ్యంలో మొదలైంది. దీనిపై అత్యున్నత హార్వర్డ్ వైద్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డాక్ర్ రాబర్ట్ హెచ్ ష్మెర్లింగ్ మాట్లాడుతూ అమెరికాలో మూడింట రెండు వంతుల మంది మాత్రమే ప్రతిరోజూ స్నానం చేస్తున్నారని తమ పరిశోధనలో తెలిసిందని చెప్పారు. ఇక ఆస్ట్రేలియాలో దాదాపు 80 శాతానికి పైగా ప్రజలు రోజూ స్నానం చేస్తున్నారని చెప్పారు. చైనా విషయానికి వస్తే జనాభాలో సగం మంది వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తున్నట్టు చెప్పారు.
వేడిమి ఎక్కువగా ఉండే ఉష్ణమండల దేశాలవారికి స్నానం ఒక చికిత్సగా ఉపయోగపడుతుందని రాబర్ట్ అభిప్రాయపడ్డారు. కానీ చల్లని దేశాలలోని వారికి అధిక చలి వల్ల స్నానం చేయాల్సిన అవసరం పడడం లేదని చెప్పారు. అందుకే చల్లని దేశాల ప్రజలు రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తారని తెలిపారు. ఇక కొన్ని దేశాల్లో నీరు దొరక్క స్నానం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రోజూ స్నానం చేయడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు హార్వర్డ్ వైద్యులు.
నష్టాలేంటంటే...
1. చర్మంపై కంటికి కనిపించని మం, బ్యాక్టిరియా కూడా ఉంటుందని, దాన్ని స్నానం నాశనం చేస్తుంది.
2. చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచే శరీరంలోని సహజ నూనెలను తొలగించడం.
3. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మం పొడిగా మారి దురదలు వస్తాయి.
4. పొడి చర్మం పగిలిపోయి వివిధ రకాల బ్యాక్టిరియాలు చేరేందుకు కారణం అవుతుంది.
5. రోజూ సబ్బులు రాయడం వల్ల శరీరంపై నివసించే మంచి సూక్ష్మ జీవులు కూడా నశిస్తాయి.
అయితే ఈ హార్వర్డ్ వైద్యులు చెప్పిన ఫలితాలు అధిక వేడిమి కల దేశాలకు వర్తించవు. చల్లని దేశాలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ అభిప్రాయాలను వ్యక్తీకరించారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి రైస్‌తో బరువు తగ్గే ఛాన్స్... నిజమేనా?
Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Also read: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ తప్పులు చేయకండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా
MonkeyPox Virus: అమ్మవారులా కనిపించే మంకీపాక్స్, ఆఫ్రికాలో పుట్టి ఇతర దేశాలకు పాకుతున్న వైరస్
Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో
Icecream Headache: ఐస్క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?