Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam
ఆసీస్ లో టెస్ట్ సిరీస్ గెలవాలి..విజయం సాధిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడే అవకాశం. పెర్త్ లో మొదటి టెస్టు. కట్ చేస్తే మధ్యాహ్నానికి టీమిండియా ఆలౌట్. అది కూడా 150 పరుగులకే. ఏదో నితీశ్, పంత్ కాసేపు ఆడారు కాబట్టి సరిపోయింది లేదంటే వంద లోపే సర్దేసేవాళ్లం. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కి దిగింది. జనరల్ గా ఏమనుకుంటున్నాం ఓన్ కండిషన్స్ వాళ్ల పిచ్ లే కాబట్టి పిచ్ కొట్టుడు కొడతారు అనుకుంటాం కదా. పైగా మనది అంత స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ కూడా కాదు. కెప్టెన్ బుమ్రా, సిరాజ్ తప్ప అంతా యంగ్ బ్యాచ్. కానీ మనోళ్లు మేజిక్ చేశారు. తన్నించుకున్నారు అనుకుంటే తగలబెట్టేశారు. కెప్టెన్ బుమ్రా ముందుండి బౌలింగ్ పదును ఏంటో చూపిస్తే...సిరాజ్ మియా, యంగ్ గన్ హర్షిత్ రానా పేస్ ధాటికి కంగారూలు కుయ్యోమొర్రోమన్నారు. మొదటి రోజు లాస్ట్ సెషన్ బ్యాటింగ్ మాత్రమే ఆడిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలో 67 పరుగులకు జస్ట్ 7 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి ఆస్ట్రేలియాకు. ప్రస్తుతానికి 83 పరుగుల లీడ్ లో ఉంది. కానీ బుమ్రా, సిరాజ్, హర్షిత్ ముగ్గురి బౌలింగ్ గురించి చెప్పాలి. నిప్పులు నిప్పులు కురిపించారు అంతే. బుమ్రా నాలుగు వికెట్లు తీస్తే..ఖవాజా, మెక్స్పీనే, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ వికెట్లు బుమ్రా తీస్తే...మిచ్ మార్ష్, లబుషేన్ లను సిరాజ్ మియా ఔట్ చేశాడు. ట్రావియెస్ హెడ్ ను హర్షిత్ రానా క్లీన్ బౌల్డ్ చేసిన విధానమైతే డ్రీమ్ డెబ్యూ ఏ బౌలర్ కైనా. భారత బౌలర్లు ఇదే ఫైర్ ప్రదర్శిస్తే...రేపు మార్నింగ్ సెషన్ లో మిగిలిన మూడు వికెట్లు కూల్చి..కాస్తమంచి ఆధిక్యమే కనబర్చొచ్చు. సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ టీమ్ ఎలా ఆడిందనే దానిని బట్టి ఈ మ్యాచ్ లో విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.