అన్వేషించండి
Advertisement
Morning Top News: తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం విజన్ 2050 , లోకేష్ మాటకు , వైసీపీ ఘాటైన ట్వీట్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్ట్, తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్ 2050
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అని చెబుతుంటారు. కానీ పోటీ పడాల్సింది పక్క రాష్ట్రాలతో కాదని, ప్రపంచ దేశాలతో అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోటీ పడే కన్నా తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తే ప్రపంచ దేశాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్ట్
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ను విజయపురి సౌత్ ఎస్సై షేక్ మహమ్మద్ షఫీ హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో 2020లో ఎన్నికల పరిశీలనకు వచ్చిన టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నపై తురకా కిషోర్ దాడి చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం రాగానే పరారీలో ఉన్న తురకా కిషోర్ ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరసింహాపురం గ్రామం సమీపంలో భక్తుల పైకి అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మరో ముగ్గురి తీవ్ర గాయాలు కాగా.. సమీపంలో ఆస్పత్రికి తరలించారు. ఇక మృతులు అన్నమయ్య జిల్లాకు చెందిన పెద్ద రెడ్డమ్మ(40), లక్ష్మమ్మ(45)గా గుర్తించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నారా లోకేశ్ వర్సెస్ వైసీపీ
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర కోసం జగన్ చేసిందేమీ లేదని.. కనీసం రైల్వే జోన్‌కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ కామెంట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బాబు ఏం పీకాడు, గతం ఒకసారి గుర్తుకు తెచ్చుకో.. మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు 52 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన మోదీ
ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. సాహిబాబాద్-న్యూ అశోక్ నగర్ మధ్య 13 కిలోమీటర్ల పొడవైన అదనపు విభాగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో సాహిబాబాద్ RRTS స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్ వరకు నమో భారత్ రైలులో మోదీ ప్రయాణించారు. ఈ సమయంలో అందులో ఉన్న పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ సత్తా చాటింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో .. రీలొకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్ - టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ పని తీరును సమర్థంగా పరీక్షించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకోగా వైరల్ అవుతోంది. డిసెంబర్ 30న స్పేస్ డాకింగ్ మిషన్‌కు సంబంధించిన 2 స్పెడెక్స్ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది. రాకెట్ నుంచి వేరైన ఈ 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ 2 శాటిలైట్స్‌ను స్పేస్‌లో అనుసంధానించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హెలికాప్టర్ కూలి.. ముగ్గురు మృతి
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పోరుబందర్‌లో కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతిచెందారు. సాధారణ శిక్షణలో భాగంగా టేకాఫ్ అయిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
క్రికెట్ దిగ్గజం గావస్కర్‌కు అవమానం
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కు అవమానం జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిథులు కళ్లు నెత్తికెక్కి ప్రవర్తించారు. తాజాగా ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ప్రదానోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేవలం ఆసీస్ గ్రేట్ అలెన్ బోర్డర్ ను మాత్రమే పిలిచారు. అక్కడే స్టేడియంలోనే ఉన్న గావస్కర్ ను మాత్రం ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దీనిపై గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
‘కల్కి’పై అనంత్ శ్రీరామ్ హాట్ కామెంట్స్
భారతీయ సాహిత్యానికి రెండు కళ్లైయిన రామాయణం, మహాభారతంపై నిత్యం దాడి జరుగుతోందని గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. సినిమాల్లో వినోదం కోసం మన పురాణాలను వక్రీకరిస్తున్నారన్నారు. భారత సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుంచి తాజాగా కల్కి సినిమా వరకు అదే జరిగిందన్నారు. క్యారెక్టర్ల వక్రీకరణ చూసి సిగ్గుపడుతున్నానన్నారు. అయితే, పొరపాటును పొరపాటని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion