News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

Todays Top 10 headlines:

పట్టాలపై మృత్యు కేళి

ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుంచి కోరమాండల్ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ వెళ్తుండగా బహంగా బజార్ స్టేషన్లో రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ టీం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

రైళ్లు రద్దు

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించగా, 900 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మోదీ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్‌ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

సంతాప దినం 

శనివారం (జూన్ 3) ఉదయం వరకు సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు బోగీల నుండి మృతదేహాన్ని తొలగించడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఒక రోజు సంతాప దినాలు ప్రకటించారు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

కేసీఆర్‌ గైర్హాజరు

" దేశంలో మూడో.. నాలుగో ఫ్రంట్‌కు ఉనికి లేదు " అని భారత రాష్ట్ర సమితి తేల్చేసింది.  బీజేపీకి ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనని ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించి.. నేరుగా జాతీయ పార్టీపెట్టిన కేసీఆర్ మూడో కూటమికి చాన్స్  లేదని ప్రకటించడం ఆశ్చర్యకరమే. జూన్12 వ తేదీన  పట్నాలో  విపక్షాల సమావేశం జరుగుతోంది. గతంలో కేసీఆర్ కలిసిన..కేసీఆర్‌ను కలిసిన వాళ్లంతా హాజరవుతున్నారు.  కానీ కేసీఆర్ మాత్రం వెళ్లడం లేదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

కిరణ్ ఏం చేస్తున్నారు?

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినా ఆయన ఏ పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఆయన అంగీకరించి ఉంటే ఏపీ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఆయన తీసుకోలేదు.  ఇటీవల బీజేపీలో చేరారు. చేరగానే కర్ణాటక సహా తెలంగాణలోనూ కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకున్నారు. కానీ ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. పార్టీ హైకమాండ్ కూడా ఆయన ఫలానా పని చేయాలని చెప్పడం లేదు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

స్పెషల్ ట్రీట్‌మెంట్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరి విచారణ ఖైదీగా చూడాలని సీబీఐ కోర్టు సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇదివరకే అరెస్టైన భాస్కర్ రెడ్డి.. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న ఆయన అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. ఏప్రిల్ 16 నుంచి ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

పోటీ గట్టిగానే ఉంది

తెలంగాణలో పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించిన ఫైనల్ పరీక్షల ఫలితాలు మే 31న వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ తుదిదశకు చేరినట్లయింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తెలంగాణ పోలీసు నియామక మండలి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

క్యాష్‌ తీయడం లేదు

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో, UPI ట్రాన్జాక్షన్లు 9 బిలియన్లకు చేరుకున్నాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. దేశంలో రిటైల్ పేమెంట్లు & సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను నిర్వహించే ఈ అంబ్రెల్లా బాడీ, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని షేర్‌ చేసింది.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఏ పాలు బెటర్

కప్పుడు సైకిల్ వేసుకుని పాల వాడు వచ్చి ఇంటింటికీ తిరిగి పాలు పోసి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మనం నిద్రలేచేసరికి ఇంటి ముందు పాల ప్యాకెట్ దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాల ప్యాకెట్లు లభిస్తున్నాయి. వీధికి కనీసం రెండు మూడు డెయిరీలు వెలుస్తున్నాయి. తాజా పాలు దొరకడం అంటే ఈ రోజుల్లో కష్టమే. కానీ కొన్నేళ్ళ క్రితం తాజా పాలు మాత్రమే దొరికేవి. ప్యాకెట్ పాలు, తాజా పాలు ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరం అనే దాని గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వీటిలో ఏది ఆరోగ్యకరమైన ఎంపిక అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి.  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

గధ ఎవరిది?

మరో ఐదు రోజుల్లో  ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే  వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌పై  క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగిస్తే పరిస్థితి ఏంటి..? ‘ఒకపక్క ఎండలు మండిపోతుంటే వర్షం ఏంట్రా అప్రాచ్ఛపు వెధవ..’ అని తిట్టుకోవద్దు.  ఏమో.. ఐపీఎల్ -16 ఫైనల్‌లో  మండు వేసవిలో అహ్మదాబాద్‌ను వాన ముంచెత్తుతుందని ఎవరైనా అనుకున్నారా..? అసలే ఇంగ్లాండ్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం..!  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published at : 03 Jun 2023 08:49 AM (IST) Tags: AP news today Todays latest news Top 10 headlines today Telugu Top News Website Top Telugu News Website Top 10 Telugu News Telangana LAtest News

ఇవి కూడా చూడండి

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర