Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
ఇండియాస్ బిగ్గెస్ట్ రీటైల్ చైన్ డీమార్ట్ షేర్ ధరలు ఇవాళ ఒకేసారి 15శాతం పెరిగాయి. మూడో త్రైమాసికంలో అద్భుతమైన రెవిన్యూ గ్రోత్ సాధించినట్లు కంపెనీ చేసిన ప్రకటనతో డీమార్ట్ దూసుకెళ్లింది.
Dmart Stocks, Avenue Supermarts share price highlights: రీటైల్ జెయింట్ డీమార్ట్ షేర్ ధరలు అమాంతం పెరిగాయి. ఇవాళ మార్కెట్లు ప్రారంభం అయిన వెంటనే డీమార్ట్ రీటైల్ స్టోర్లను నిర్వహించే Avenue Supermarts ఒక్కసారిగా పెరిగింది. నిన్న రు. 3615 దగ్గర క్లోజ్ అయిన షేర్ ఇవాళ మార్కెట్ ప్రారంభం కాగానే ఒక్కసారిగా రు.3972 దగ్గర ట్రేడ్ అయింది. ఆ తర్వాత ఈరోజు అత్యధిక ధర రు.4165కు చేరింది. చివరకు 11.21 గ్రోత్‌తో 4023 రూపాయలకు క్లోజ్ అయింది. NSE లో అవెన్యూ సూపర్ మార్ట్ 10శాతం గ్రోత్ నమోదు చేసింది.
అదరగొట్టిన మూడో త్రైమాసిక ఫలితాలు
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఔ Q3 రెవిన్యూ ప్రకటనతో మార్కెట్ ప్రారంభంలో షేర్ ప్రైస్ ఊపందుకుంది. సెప్టెంబర్ -డిసెంబర్ థర్డ్ క్వార్టర్‌లో 15,565కోట్ల రెవిన్యూ సాధించినట్లు డీమార్ట్ ప్రకటించింది. కిందటేడాది ఇదే త్రైమాసికానికి నమోదు చేసిన 13,247కోట్లతో పోల్చితే ఇది 17.5శాతం ఎక్కువ. రెవిన్యూలో భారీ వృద్ధి కనిపించడంతో మార్కెట్లో షేర్ ధర పెరిగింది.
అంచనాలకు మించి పెరిగిన షేర్
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు Morgan Stanley, Goldman Satch వంటి అంచనాలను మించి షేర్ ప్రైస్ పెరిగింది. షేర్ ధర 3702 రూపాయల వద్ద ఉండొచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. కానీ అంతకు మించిన రైజ్ కనిపించింది. 15శాతం గ్రోత్ ఉన్నప్పటికీ డీమార్ట్ హిస్టారికల్ గ్రోత్ 20శాతం కూడా నమోదు చేసిన రోజులున్నాయని.. ఈ త్రైమాసికంలో కొత్త స్టోర్లు ప్రారంభం కావడం వల్లే రెవిన్యూ పెరగడం.. తద్వారా షేర్ ప్రైస్ కూడా పెరిగిందని తెలిపింది. కిందటి త్రైమాసికంతో పోల్చితే 12శాతం స్టోర్లు పెరిగాయని తెలిపింది. అయినప్పటికీ.. తాము అంచనా వేసిన దానికన్నా రెవిన్యూ 1శాతం ఎక్కువుగా ఉన్నట్లు మోర్గాన్ ఒప్పుకుంది. హాంకాంగ్ కు చెందిన CLSA DMart షేర్ బాగా ఎక్కువుగా ఉండొచ్చని అంచనావేసింది. ఏకంగా 50శాతం వరకూ పెరగొచ్చని చెప్పినప్పటికీ అది జరగలేదు. CLSA షేర్ ప్రైస్ Rs 5,360 వరకూ కూడా చేరుకోవచ్చని లెక్క గట్టింది. మరో వైపు షేర్ ప్రైస్ బాగా పడిపోయే అవకాశం ఉందని మరో అంతర్జాతీయ సంస్థ Goldman Sachs on Avenue Supermarts కు Sell' rating ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ ₹3,425 ఉండొచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తం 29 ప్రముఖ బ్రోకరింగ్ సంస్థల్లో 11 సంస్థలు షేర్లు అమ్మమనే సూచించాయి. అయినప్పటికీ డీమార్ట్ మంచి రిజల్ట్స్ చూపించింది. అయితే ఇప్పటికీ షేర్ ధర గడచిన ఏడాది హైయెస్ట్ కంటే తక్కువుగానే ఉంది. డీమార్ట్ ఈ త్రైమాసికంలోనే 10 కొత్త స్టోర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికి దేశవ్యాప్తంగా స్టోర్ల సంఖ్య 387కు పెరిగింది. కొత్త వాటిని పెంచుకుంటూ పోవడంతో ప్రైస్ లో ఇదే జోష్ కొనసాగే అవకాషం ఉందన్న అంచనా ఉంది.