Coromandel Train Accident: రైలు ప్రమాదంతో ఒడిశాలో సంతాప దినం, ముంబై-గోవా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం రద్దు
శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంపై ఒడిశా ప్రభుత్వం శనివారం (జూన్ 3) ఒక రోజు రాష్ట్రంలో సంతాపదినం ప్రకటించింది.
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం జరిగిన భారీ రైలు ప్రమాదంలో 233 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం (జూన్ 3) ఉదయం వరకు సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు బోగీల నుండి మృతదేహాన్ని తొలగించడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ఘటనతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ఒక రోజు సంతాప దినాలు ప్రకటించారు.
కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ వెళ్తుండగా బహంగా బజార్ స్టేషన్‌లో రాత్రి 7గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ఒడిశాలో సంతాప దినం
బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక రోజు సంతాప దినం పాటించాలని ఆదేశించారు. జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
వందేభారత్ ప్రారంభోత్సవం వాయిదా
ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రధాని కార్యక్రమాలను కూడా మార్చేశారు. ముంబై-గోవాకు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అది వాయిదా పడింది.
ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది.
దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇలా ఉంది.
రైలు నెంబర్ 22807 టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 22873 కూడా టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 18409ను టాటా జంషెడ్ పూర్ వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 22817ను కూడా టాటా వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 15929ను తిరిగి భద్రక్ కు పిలిపించారు.
12840 చెన్నై సెంట్రల్-హౌరా ప్రస్తుతం ఖరగ్ పూర్ డివిజన్ లోని జరోలి గుండా నడుస్తుంది.
18048 వాస్కోడిగామా - షాలిమార్ కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా దారి మళ్లించబడింది.
సికింద్రాబాద్-షాలిమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా మళ్లిస్తారు.
రద్దయిన రైళ్ల జాబితా ఇలా ఉంది.
రైలు నెంబర్ 12837 హౌరాపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. అలాగే రైలు నెంబర్ 12863 హౌరా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేశారు. రైలు నెంబర్ 12839 హౌరా-చెన్నై సెంట్రల్ మెయిల్, 12895, 20831, 02837 రైళ్లను కూడా రద్దు చేశారు.
ఎవరు ఏం చెప్పారు?
రైలు నెంబర్ 12841 చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ వెళ్తోంది. ఈ రైలు జూన్ 2న మధ్యాహ్నం 3.30 గంటలకు షాలిమార్ కు బయలుదేరింది. రాత్రి 8.30 గంటలకు ఖరగ్ పూర్ డివిజన్ పరిధిలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
ప్రమాదం తర్వాత ప్రకటించిన పరిహారం
ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల్లోని కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురిని సోరో, గోపాల్ పూర్, ఖంటాపరా ఆరోగ్య కేంద్రాలకు తరలించగా, పలువురిని బాలాసోర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు.