అన్వేషించండి

First Flight Experience : మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి

First Flight Journey : కొందరు విమానాల్లో రెగ్యులర్​గా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ కొందరు ఇప్పటికీ ఫ్లైట్ జర్నీ చేసి ఉండరు. అలాంటి వారు మొదటిసారి విమాన ప్రయాణం చేస్తుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.  

Tips to Follow for First Flight Journey : రోడ్ జర్నీ, ట్రైన్ జర్నీని కొందరు రెగ్యులర్​గా చేస్తారు. కానీ ఎన్ని ఏళ్లు గడిచినా.. విమాన ప్రయాణం చేయనివారు కూడా ఉంటారు. అలాంటివారు మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేయాల్సి వస్తే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కొన్ని బేసిక్స్ ఫాలో అయితే మీరు విమాన ప్రయాణం చేసేప్పుడు ఎలాంటి భయం ఉండదు. ఎయిర్​పోర్ట్​కి వెళ్లడం, ప్రయాణం కోసం సిద్ధం కావడం నుంచి బోర్డింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

జర్నీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు ప్రయాణిస్తున్న విమానం డిటైల్స్​ను ఆన్​లైన్​లో చెక్ చేసుకోవాలి. అలాగే మీ బోర్డింగ్ పాస్​ని ప్రింట్ తీసుకోవడం లేదా డౌన్​లోడ్ చేసి పెట్టుకోవాలి. ప్రింట్ తీసుకుంటే మరీ మంచిది. ఐడీ ప్రూఫ్, పాస్​పోర్ట్, విసా(అవసరమైతే) కచ్చితంగా తీసుకుని వెళ్లాలి. బ్యాగేజ్ పాలసీ ప్రకారం మీ లగేజ్​ని ప్యాక్ చేసుకోవాలి. ప్రయాణానికి కంఫర్టబుల్, లేయరింగ్ పద్ధతిలో డ్రెస్​లు వేసుకుంటే కంఫర్టబుల్​గా ఉంటుంది. 

ఎయిర్​పోర్ట్​కి వెళ్లేందుకు.. 

మీరు విమాన ప్రయాణం చేసేప్పుడు కచ్చితంగా ఎయిర్​పోర్ట్​కి మీ ఫ్లైట్​ జర్నీ మొదలయ్యే 2 గంటల ముందే చేరుకోవాలి. కౌంటర్​లో చెక్​ ఇన్​ అవ్వాలి. సెక్యూరిటీ చెక్, స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాగేజ్​ని డ్రాప్ ఆఫ్ చేసుకోవాలి. 

బోర్డింగ్ 

మీ బోర్డింగ్ పాస్​ను గేట్​ ఏజెంట్​కు సబ్​మీట్ చేయాలి. అప్పుడు వారు ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిస్తారు. జర్నీకోసం మీకు ఎంపికైన సీట్​లోకి వెళ్లి కూర్చోవడమే. ఫ్లైట్​లో ఇచ్చే ఇన్​స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. వాటర్​ని తాగి హైడ్రేటెడ్​గా ఉంటే మంచిది. స్నాక్స్ వంటివి తినొచ్చు. మ్యూజిక్ వినండి. 

ల్యాండింగ్ తర్వాత.. 

విమానం పూర్తిగా ఆగిన తర్వాత లేచి దిగి వెళ్లండి. మీ బ్యాగేజ్​ని క్లైమ్ చేసుకోండి. తర్వాత ప్రయాణానికి ట్యాక్సి లేదా ఇతర వాహన సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు. 

టేకాఫ్ సమయంలో.. 

ఫ్లైట్ టేకాఫ్ అవుతున్న సమయంలో కొందరు టెన్షన్​తో ఇబ్బంది పడుతుంటారు. గుండెలో దడ వంటి భయం ఉండొచ్చు. అలాంటి వారు వీలైనంత రిలాక్స్​గా ఉండేందుకు ప్రయత్నించండి. మొదటిసారి ప్రయాణించాలనుకున్నప్పుడు ఎక్కువ సమయం ఉండేవి కాకుండా గంట, రెండు గంటల జర్నీ ఉండే విమాన ప్రయాణం చేయాలి. అప్పుడు ఫ్లైట్ అలవాటు అవుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినా.. తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

మరిన్ని టిప్స్ 

మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేసేప్పుడు.. కాస్త ఒత్తిడిగానే ఉంటుంది. కానీ కామ్​గా, ప్రశాంతంగా ఉంటే స్ట్రెస్ ఉండదు. ఫ్లైట్స్​ కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కంగారు పడకపోవడం మంచిది. విమానంలో నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే జర్నీ మీకు పెద్దగా కష్టమనిపించదు. 

ఈ సింపుల్, బేసిక్ టిప్స్ ఫాలో అయితే మీరు ఫ్లైట్ జర్నీ చేయాలంటే పెద్దగా ఇబ్బంది పడరు. ముఖ్యంగా జర్నీకి రెండు గంటల ముందే ఎయిర్​పోర్ట్కి చేరుకుంటే ప్రశాంతంగా జర్నీని ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకపోవడమే మంచిది. 

Also Read : ఇండియాలోని బెస్ట్, బ్యూటీఫుల్ బీచ్​లు ఇవే.. న్యూ ఇయర్​ 2025లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసేసుకోండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget