Beautiful Beaches in India : ఇండియాలోని బెస్ట్, బ్యూటీఫుల్ బీచ్‌లు ఇవే.. న్యూ ఇయర్ 2025లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసేసుకోండి
Top Beaches in India : బీచ్‌లంటే మీకు ఇష్టమా? అయితే ఇండియాలోనే అందమైన బీచ్‌లు ఏంటో? ఎక్కడున్నాయో లిస్ట్ ఇక్కడుంది. మీరు ఓ లుక్కేసేయండి.
Best and Beautiful Beaches in India for Trip : న్యూ ఇయర్ 2025లో మీరు ట్రిప్స్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? మీకు బీచ్‌లంటే బాగా ఇష్టమా? అయితే ఈ సంవత్సరం మీరు వెళ్లాల్సిన లిస్ట్ ఇక్కడుంది. ఇండియాలో అత్యంత అందమైన బీచ్‌లు ఎక్కడున్నాయో ఇక్కడ లిస్ట్ ఉంది. వాటిని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో తెలుసుకుని.. మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.
పలోలెం బీచ్ (Palolem Beach)
బీచ్ అంటే చాలామందికి గుర్తొచ్చేది గోవానే. అయితే దక్షిణ గోవాలోని పలోలెం బీచ్ అందమైన బీచ్‌లలో ఒకటి. చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లతో నిండి ఈ బీచ్ టూరిస్టులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. స్విమ్మింగ్ చేయడానికి, నైట్ లైఫ్‌కి ఈ బీచ్ బెస్ట్ అనే చెప్పవచ్చు.
అగోండా బీచ్ (Agonda Beach)
నార్త్ గోవాలోని అగోండా బీచ్ కూడా ఇండియాలోని బ్యూటీఫుల్ బీచ్‌లలో ఒకటి. నార్త్ గోవాల్లోని ఇతర బీచ్‌లతో పోలిస్తే ఇది మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ బీచ్‌లు ఈత కొట్టడానికి అనువైనది. డాల్ఫిన్లను కూడా చూడొచ్చు. ప్రశాంతతను కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
వర్కలా బీచ్ (Varkala Beach)
కేరళలోని వర్కల బీచ్ ఇండియాలోని అందమైన బీచ్‌లలో ఒకటి. ఆకట్టుకునే అరేబియా సముద్రం, బ్యూటీఫుల్ లొకేషన్లు, కొబ్బరి చెట్లతో నిండిన ఈ బీచ్ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లోకల్ షాప్‌లు, కేఫ్‌లను కూడా విజిట్ చేయవచ్చు. ఔషధ గుణాలను కలిగి ఉన్న సహజ నీటి బుగ్గలు కూడా ఇక్కడ ఉన్నాయి.
మరారి బీచ్, కోవలం బీచ్ (Marari Beach,Kovalam Beach)
కేరళలోని మరారి బీచ్ కూడా మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడి వాతావరణం మీ మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. విశ్రాంతి కోసం ఎదురుచూసేవారికి ఇది బెస్ట్ ప్లేస్. అలాగే ఆయుర్వేద చికిత్సలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కేరళలోని కోవలం బీచ్ కూడా అందమైన బీచ్‌లలో ఒకటి. సన్‌బాత్, స్విమ్మింగ్, సర్ఫింగ్, పారాసైలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌కు ఇది అనువైనది.
టర్కర్లీ బీచ్ (Tarkarli Beach)
మహారాష్ట్రలోని టర్కర్లీ బీచ్ క్లీన్ వాటర్, సముద్రజీవులకు అనువైన బీచ్‌గా ప్రసిద్ధి చెందింది. వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కర్లీ నది బ్యాక్ వాటర్స్‌తో ఆకట్టుకుంటుంది. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, బోటింగ్‌లను ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
రాధానగర్ బీచ్ (Radhanagar Beach)
అండమాన్ నికోబార్ దీవుల్లోని స్వరాజ్ ద్వీప్ దగ్గర రాధానగర్ బీచ్ ఉంది. ఇది ఇండియాలోని అందమైన బీచ్‌ల లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బీచ్ ఆసియాలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా చెప్తారు. ఇక్కడ వాటర్ చాలా ప్యూర్‌గా ఉంటుంది. నీటికింద ఉండే ఇసుక కూడా బాగా కనిపిస్తుంది. సన్ సెట్, సన్ రైజ్ సమయంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది.
నీల్ ఐలాండ్ బీచ్‌లు(Neil Island Beaches)
అండమాన్, నికోబార్ దీవుల్లోని నీల్ ఐలాండ్‌లోని బీచ్‌లు బ్యూటీఫుల్ బీచ్‌లకు నిలయంగా చెప్తారు. భరత్పూర్, లక్ష్మణ్‌పూర్, సీతాపూర్ బీచ్‌లు అత్యంత అందమైన బీచ్లగా పేరు తెచ్చుకున్నాయి. ఇక్కడ రంగురంగుల పగడపు దిబ్బలు, ఇసుక తెన్నెలు బాగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ బీచ్‌లలో నడుస్తూ.. సూర్యాస్తమయాలను ఎంజాయ్ చేయవచ్చు.
ఈ అందమైన బీచ్‌లను న్యూ ఇయర్ 2025లో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో, సోలోగా వెళ్లాలనుకునేవారికి కూడా ఇవన్నీ మంచి అనుభూతిని ఇస్తాయి.
Also Read : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్‌లతో రచ్చ చేసేయండిలా