Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్‌లతో రచ్చ చేసేయండిలా
2025 Travel Hacks : కొత్త సంవత్సరంలో కేవలం 12 లీవ్స్ పెడితే మీరు 50 హాలీడేలు పొందవచ్చట. వీటిని మీరు ట్రావెల్ చేయడానికి వాడుకోవచ్చు. ఇంతకీ ఈ ఏడాది ఏమేమి సెలవలున్నాయంటే..
Get 50 Holidays from Just 12 Leave Days in 2025 : న్యూ ఇయర్ 2025. ఈ కొత్త ఏడాదిని ట్రిప్స్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలంటే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాదిలో కేవలం 12 రోజులు సెలవలు పెడితే.. 50 రోజులు హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అదేలాగో.. ఏ లీవ్స్ ఎప్పుడు పెట్టుకుంటే మంచిదో.. పబ్లిక్ హాలీడేలు ఎప్పుడు వచ్చాయో.. శని, ఆదివారాలతో కలిపి వాటిని ఎలా ట్రిప్ కోసం ప్లాన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
జనవరిలో(సంక్రాంతి)
జనవరిలో సంక్రాంతి సమయానికి లాంగ్ వీకెండ్ వస్తుంది. 11 శనివారం, 12 ఆదివారం, 13 లీవ్ తీసుకుంటే.. 14వ తేదీన సంక్రాంతి. సొంతూరు వెళ్లాలనుకునేవారికి ఇది బెస్ట్. లేదా మొదటి ట్రిప్ ఈ రోజుల్లోనే ప్రారంభించవచ్చు.
ఫిబ్రవరి, మార్చి
ఫిబ్రవరి, మార్చిలో 9 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో మీరు లాంగ్ వీకెండ్ కోసం లాస్ట్ వీక్ వరకు ఆగాలి. 22వ తేది శనివారం వస్తే.. 23 ఆదివారం. 24, 25 లీవ్ పెట్టి.. 26వ తేదీన శివరాత్రి హాలిడే తీసుకొని, 27, 28 కూడా లీవ్ పెడితే.. దానికి కంటిన్యూగా మార్చి 1వ తేది శనివారం, మార్చి రెండవ తేది ఆదివారం కలిసి వస్తుంది.
మార్చిలో బోనస్‌గా..
మార్చిలో మొదటివారం తర్వాత మూడో వారం నుంచి మళ్లీ లీవ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.. చిన్న చిన్న ట్రిప్స్‌కి వెళ్లేందుకు స్పేస్ ఉంటుంది. 14 శుక్రవారం హోలీ వచ్చింది. 15వ తేదీ శనివారం, 16 ఆదివారం కాబట్టి చిన్న ట్రిప్‌కి బెస్ట్ ఆప్షన్. 29వ తేది శనివారం, 30 ఆదివారం, 31వ తేదీ సోమవారం ఈద్ హాలిడే ఉంటుంది. వీటిని కూడా మీరు ట్రిప్ కోసం వాడుకోవచ్చు.
ఏప్రిల్ (గుడ్ ఫ్రైడే)
ఏప్రిల్ నెలలో మీరు ఎక్కువ మీరు వీకెండ్‌తో కలిసి వచ్చేలా 3 రోజుల ట్రిప్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాంటి హాలిడే లేకుండా. ఎందుకంటే ఏప్రిల్ 18వ తేది శుక్రవారం గుడ్ ఫ్రైడే, 19 శనివారం, 20 ఆదివారం. కాబట్టి ఈ మూడురోజుల్లో ట్రిప్‌కి వెళ్లొచ్చు.
మేలో (చిన్న ట్రిప్)
మేలో ఒకరోజు లీవ్ పెట్టుకుంటే నాలుగు రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మే 1 మేడే గురువారం వచ్చింది. ఫ్రైడే లీవ్ పెట్టుకుంటే.. 3,4 శని, ఆదివారాలు. ఈ నాలుగు రోజులు ట్రిప్‌కి వెళ్లేందుకు బెస్ట్ ఆప్షన్.
ఆగస్ట్‌లో జాక్‌పాట్
ఆగస్ట్‌లో నాలుగు రోజులు లీవ్ ప్లాన్ చేసుకుంటే.. 12 రోజులు ట్రిప్‌కోసం వాడుకోవచ్చు. చిన్న ట్రిప్ కోసం ఆగస్టు 15వ తేదీ శుక్రవారంని వాడుకొని, శని, ఆదివారాలతో చిన్న ట్రిప్‌కి వెళ్లొచ్చు. ఆ తర్వాతి వారంలో ఆగస్టు 23వ తేది శనివారం, 24 ఆదివారం.. 25, 26 లీవ్స్ 27వ తేదీన వినాయకచవితి, 28, 29 లీవ్స్ తీసుకుంటే 30, 31 శని, ఆదివారంతో పెద్ద ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే సొంతూరుకు వెళ్లొచ్చు.
అక్టోబర్‌లో (దీపావళి)
అక్టోబర్ 2వ తేది గురువారం వచ్చింది. శుక్రవారం లీవ్ తీసుకుంటే.. 4, 5వ తేదీలు శని, ఆదివారం వస్తాయి. ఆగస్టు 18, 19 శని ఆదివారంతో పాటు.. ఆగస్టు 20 దీపావళి కలిసి వస్తుంది.
డిసెంబర్లో(నవంబర్ గ్యాప్)
డిసెంబర్లో ఒక్కరోజు లీవ్ పెడితే 4 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. 26వ తేదీన లీవ్ పెడితే 25వ తేది క్రిస్మస్ హాలీడే, 27,28 తేదీల్లో వచ్చే శని, ఆదివారంతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ ప్లానింగ్‌తో మీరు 12 రోజులు లీవ్ పెట్టుకొని 50 రోజులు హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ అందరికీ కంపెనీల్లో శని, ఆదివారాలు ఆఫ్‌లు ఉండకపోవచ్చు. కానీ మేజర్‌గా డబుల్ వీక్లీ ఆఫ్‌లు శని, ఆదివారాలే ఉంటాయి. కానీ కొందరికి వీక్లీ ఆఫ్‌లు మిడ్ వీక్‌లో ఉంటాయి. అలాంటివారు మాత్రం.. బడ్జెట్ ఉన్నప్పుడు మీకు కంఫర్ట్‌బుల్‌గా ఉండే రోజుల్లో ఇలాంటి ట్రిప్స్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read : గర్ల్ ఫ్రెండ్‌తో రోడ్ ట్రిప్ ప్లానింగ్.. 2025లో ఒక్కో నెలకి ఒక్కో బెస్ట్ ప్లేస్, పూర్తి డిటైల్స్ ఇవే