అన్వేషించండి

Curd Poha: పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!

Curd Poha: ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అందుకే పొయ్యి వెలిగించకుండానే ఉదయం కుటుంబమంతా ఆరగించే బ్రేక్‌ఫాస్ట్ గురించి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గ్యాస్ కొరత నేపథ్యంలో స్టవ్ వాడకుండా పెరుగు అటుకులు తయారుచేయండి.
  • ఐదు నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్.
  • జీర్ణక్రియకు మేలుచేసి, ఎముకలను బలపరిచే పోషకాలు కలిగి ఉంటుంది.
  • శరీరానికి శక్తినిచ్చి, వేసవిలో చల్లదనాన్ని అందించే అద్భుత వంటకం.

Curd Poha: ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు రాత్రి డిన్నర్ వరకు పొయ్యి వెలిగించదని ఏ ఫుడ్ రెడీ కాదు. అయితే ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతోంది. దీంతో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అందుకే గ్యాస్‌తో పని లేకుండా పొయ్యి వెలిగించకుండా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ గురించి తెలుసుకుందాం. 

చాలా మంది గ్యాస్ కొరత కారణంగా బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారు. అయితే ఇది ప్రమాదం. అందుకే ఖాళీ కడుపుతో ఉండటం కంటే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను సింపుల్‌గా స్టౌవ్ వెలిగించకుండానే చేసుకోవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లో తయారయ్యే ఎంతో రుచికరమైన , ఆరోగ్యకరమైన పెరుగు అటుకులు(Curd Poha) గురించి చూద్దాం. 

పెరుగు అటుకులు చేయటానికి కావాల్సిన పదార్థాలు 

ఈ వంటకానికి కావాల్సిన వి ఇంట్లో ఉండేవే. 

  • అటుకులు- ఒక కప్పు(పలచనివి అయితే మంచిది)
  • పెరుగు- ఒక కప్పు
  • క్యారెట్ తురుము- రెండు టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి- ఒకటి చాలు 
  • కొత్తిమీర- కొద్దిగా చాలు 
  • ఉప్పు- తగినంత
  • క్రిస్పీ టచ్‌ కోసం - పల్లీలు లేదా మిక్చర్‌
  • ఫ్లేవర్‌ కోసం - అర టీ స్పూన్‌ నిమ్మరం(ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు)

తయారీ విధానం 

మొదట అటుకులను ఒక గిన్నెలోకి తీసుకొని నీటితో కడగాలి. నీటిని పూర్తిగా వడకట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తగా, మృదువుగా తయారవుతాయి. తర్వాత ఒక బౌల్‌ తీసుకొని అందులో నానిన అటుకులను వేయాలి. అందులో ఒక కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా తరిమిన పచ్చి మిర్చి ముక్కలు , కొత్తిమీర వేసుకోవాలి. చివరగా వడ్డించే ముందు పైన కొద్దిగా పల్లీలు, లేదా మిక్చర్‌ చల్లితే, తినేటప్పుడు కరకరలాడుతుంది. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పులుపు ఇష్టపడేవారు కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. 

మరింత రుచి కోసం చిన్న చిట్కాలు 

ఈ పెరుగు అటుకులు ఇంకా వెరైటీగా మార్చుకోవాలని అనుకుంటే అందులో కొన్ని దానిమ్మ గింజలు లేదా దోసకాయ ముక్కలు కూడా కలుపుకోవచ్చు. దీని వల్ల రుచి పెరగడమే కాకుండా మరిన్ని విటమిన్లు శరీరానికి అందుతాయి. 

పెరుగు అటుకులు తినడం వల్ల కలిగే ప్రయోజనం

ఇది కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు, దీని వెనుక ఆరోగ్యం రహస్యాలు ఉన్నాయి. అటుకులు, పెరుగు రెండు కూడా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. తిన్న తర్వాత భారంగా అనిపించదు. పెరుగులో ఉండే కాల్షియం, ప్రోటీన‌‌ వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇది పెరుగుతున్న పిల్లలకు చాలా మంచిది. ఉదయం పూట ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో పెరుగు అటుకులు తినడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఎండ వల్ల వచ్చే నీరసం తగ్గుతుంది. 

Frequently Asked Questions

గ్యాస్ కొరత సమయంలో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం మంచిదేనా?

ఖచ్చితంగా కాదు. ఖాళీ కడుపుతో ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. గ్యాస్ అవసరం లేని, త్వరగా చేసుకోగల బ్రేక్‌ఫాస్ట్ తినడం మంచిది.

పెరుగు అటుకులు తయారీకి ఎంత సమయం పడుతుంది?

పెరుగు అటుకులు కేవలం 5 నిమిషాల్లోనే తయారవుతాయి. ఇది త్వరగా, సులభంగా చేసుకోగలిగే అల్పాహారం.

పెరుగు అటుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి?

అటుకులు, పెరుగు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, మరియు క్రిస్పీనెస్ కోసం పల్లీలు లేదా మిక్చర్ అవసరం.

పెరుగు అటుకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పెరుగులోని కాల్షియం, ప్రోటీన్లు ఎముకలను బలపరుస్తాయి. వెంటనే శక్తిని అందించి, రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.

టాప్ హెడ్ లైన్స్

Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget