Horoscope 3rd January 2025: ఈ రాశులవారు చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి...వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
జనవరి 03 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు పని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. శత్రువులను అధిగమిస్తారు. గురువు పట్ల విధేయత కలిగి ఉండండి. మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. నమ్మకద్రోహ స్నేహితులను గుర్తిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు భౌతిక వనరులను ఎంజాయ్ చేస్తారు. పిల్లల ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రణాళికలను చక్కగా అమలు చేయగలుగుతారు. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి
మిథున రాశి
ఈ రోజు ఆఫీసు వాతావరణం బాగుంటుంది. ఉన్నతాధికారులు మీ ఆలోచనలకు ఆకర్షితులవుతారు. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. వివాదాస్పద సమస్యలకు దౌత్యపరమైన పరిష్కారాలు లభిస్తాయి. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త.
కర్కాటక రాశి
ఈ రోజు తప్పుడు వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండండి. కొత్త పనులు ప్రారంభించడంలో ఇబ్బంది ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో నైపుణ్యం ప్రదర్శిస్తారు.
Also Read: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
సింహ రాశి
ఈ రోజు పెద్ద ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఓపికగా పని చేయాలి. రోజువారీ దినచర్యలో బిజీగా ఉంటారు. వ్యాపారంలో అమ్మకాలు పెరగడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. అవివాహిత వ్యక్తుల సంబంధం కుదురుతుంది
కన్యా రాశి
ఈ రోజు కార్యాలయంలో మీరు అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ విజయాల గురించి గొప్పగా చెప్పుకోకండి. ఏ చిన్న అనారోగ్య సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయవద్దు. వైద్య పరీక్షలు చేయించుకోండి. కొత్తగా అప్పులు చేయొద్దు..పాత అప్పులు తీర్చేందుకు ప్రయత్నించండి.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి దంపతుల మధ్య వివాదాలు తొలగిపోతాయి. మీ విజయాలు ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. మీ జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించండి
Also Read: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
వృశ్చిక రాశి
ఈ రోజు అపార్థం కారణంగా సంబంధాలలో చేదు ఉండవచ్చు. యోగా , ధ్యానాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. మీరు కార్యాలయంలో ఉన్నత అధికారాన్ని పొందవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
ధనుస్సు రాశి
ఈ రోజు పని ప్రదేశంలో వాతావరణం బాగానే ఉంటుంది. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ నిర్వహణ సామర్థ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. మీరు ఈరోజు పాత స్నేహితులను కలుస్తారు.
మకర రాశి
ఈ రోజు మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు లాభిస్తాయి. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. సాహిత్యంపై ఆసక్తి ఉంటుంది.
Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!
కుంభ రాశి
ఈ రోజు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మార్కెటింగ్ సంబంధిత వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. మేధో సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో వివాదాలు పరిష్కారం అవుతాయి
మీన రాశి
ఈ రోజు డబ్బుకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశోధన సంబంధిత పనులలో ఆటంకాలు ఉండవచ్చు. నియమాలను జాగ్రత్తగా పాటించండి, ఆర్థిక నష్టం ఉండవచ్చు.
Also Read: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.