Tirumala: 2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అన్ని వందల కోట్లా!
Tirumala Hundi Income: 2024 పూర్తిచేసుకుని 2025లో అడుగుపెట్టాం.. గడిచిన ఏడాది శ్రీవారిని భారీగా దర్శించుకున్న భక్తులు సమర్పించిన సొమ్ము ఎంతో తెలుసా..ఈ వివరాలు వెల్లడించింది టీటీడీ..
Tirumala Srivari Hundi Income of 2024: గతేడాదికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వివరాలు వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
2024 సంవత్సర కాలంలో తిరుమలేశుడికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది
2024 లో శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 2.55 కోట్లు
2024 లో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 99 లక్షలు
2024లో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య - 6.30 కోట్లు
2024లో విక్రయించిన లడ్డూల సంఖ్య - 12.14 కోట్లు
Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. సాధారణంగా న్యూ ఇయర్ సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తుతుంటారు. తిరుమలలో కూడా ప్రత్యేక అంలకరణలు చేస్తుంటారు. అయితే తెలుగు న్యూ ఇయర్ ఉగాది ( Ugadi 2025 Date March 30) సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. అందుకే జనవరి 1 సందర్బంగా ప్రత్యేక పరిస్థితులు ఏమీలేవు..సాధారణంగా ఉంది. ఏటికేటు నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతూ..ఉగాదికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.
జనవరి 1 సందర్భంగా శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఎలాంటి టోకెన్, టికెట్ లేకపోవడంతో ఆరు నుంచి 8 గంటల్లోపే దర్శనం చేసుకున్నారు. ఇక స్లాటెడ్ టోకెన్ , టికెట్ పొందిన భక్తులు కేవలం మూడు గంటల్లో తిరుమలేశుడిని చూసి తరించారు. లడ్డూ విక్రయాలు జోరందుకున్నాయి. డైరీలు, క్యాలెండర్ల కోసం కౌంటర్ల వద్ద భక్తులు క్యూ కట్టారు.
జనవరి 02 గురువారం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లో 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా 69 వేల 630 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అందులో 18,965 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
మరోవైపు మరికొద్దిరోజుల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉండడంతో ఈ సమయంలో ఏడు కొండలవాడి దర్శనార్థం భక్తులు పోటెత్తనున్నారు. భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం (vaikunta ekadasi 2025) జనవరి 10 నుంచి 19 వరకూ 10 రోజుల పాటూ కల్పిస్తున్నారు. ఈ మేరకు టోకెన్లు జారీ చేసి..టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు.
Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం
మార్కండేయ ఉవాచ ।
నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ ।
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥
సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు ।
ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతుమేహరిః ॥
ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు ।
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః ।
పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు ॥
య ఏత-ద్వజ్రకవచ-మభేద్యం వేంకటేశితుః ।
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతినిర్భయః॥
ఇతి మార్కండేయ-కృతం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ-స్తోత్రం సంపూర్ణమ్ ॥
ఓం నమో నారాయణాయ
Also Read: కుంభమేళాకి నాగ సాధువులు, అఘోరాలు ఎందుకొస్తారు - ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అఖాడాల పాత్ర ఏంటి!