Uttarayan 2025 Date Timings : ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!
Uttarayana Punyakalam 2025: సంక్రాంతి వచ్చేస్తోంది అన్నప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అనే మాట వినిపిస్తుంది. 2025లో ఉత్తరాయణం ఎప్పటి నుంచి? ఉత్తరాయణం పుణ్యకాలం అని ఎందుకంటారు?
Uttarayana Punyakalam 2025: 2025 జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఆయనము అంటే 3 రుతువులు లేదా 6 నెలలు. ఏడాదికి రెండు ఆయనాలు వస్తాయి. అవే..ఉత్తరాయణం, దక్షిణాయనం.
ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు సూర్యుడి పయనం అని అర్థం. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి...దక్షిణం వైపు పయనిస్తే దక్షిణానయం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు.
ఏటా జనవరి లో వచ్చే మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది..
ఏటా జూన్ లో వచ్చే కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది..
Also Read: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!
తెలుగు నెలల ప్రకారం ఉత్తరాయణం-దక్షిణాయనం
పుష్య మాసం - దక్షిణాయనం + ఉత్తరాయణం - హేమంత ఋతువు ( జనవరి - ఫిబ్రవరి)
మాఘ మాసం ( ఫిబ్రవరి)- ఉత్తరాయనం - శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం ( మార్చి) - ఉత్తరాయనం - శిశిర ఋతువు
చైత్ర మాసం (ఏప్రిల్) - ఉత్తరాయణం - వసంత ఋతువు
వైశాఖ మాసం (మే) - ఉత్తరాయణం - వసంత ఋతువు
జ్యేష్ట మాసం (జూన్) - ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు x
ఆషాఢ మాసం - ఉత్తరాయణం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ( జూలై)
శ్రావణ మాసం (ఆగష్టు)-దక్షిణాయనం - వర్ష ఋతువు
భాద్రపద మాసం (సెప్టెంబర్) -దక్షిణాయనం - వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం (అక్టోబర్) -దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం (నవంబర్) -దక్షిణాయనం - శరత్ ఋతువు
మార్గశిర మాసం (డిసెంబర్) -దక్షిణాయనం - హేమంత ఋతువు
'సరతి చరతీతి సూర్యః'..అంటే సంచరించేవాడు అని అర్థం.
సూర్యుడి సంచారం రెండు విధాలు.. మానవులకు సంవత్సర కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం
'ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత'
అంటే 6 నెలలు ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు...6 నెలల దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
సంక్రాంతి అంటే
"సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అనే అర్థం వస్తుంది. సూర్య భగవానుడు మేష రాశి నుంచి 12 రాశుల్లో సంచరిస్తూ పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలో ప్రవేశించే సమయమే సంక్రాంతి. ఇలా 12 రాశుల్లో సంచరిస్తూ కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతి.. మకరంలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే సకల దారిద్ర్యాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.
ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు?
ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు...మరి దక్షిణాయనం పుణ్యకాలం కాదా? అంటే..దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం పగటి సమయం. దేవతలు మేల్కొని ఉండే ఈ ఆరునెలల కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆరు నెలలు పూజలు, ఉపవాసాలు, తీర్థయాత్రలకు అనువైన సమయం అని చెబుతారు. ఉత్తరాయణంలో సూర్య సంచారం మొదలయ్యే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రనుంచి లేచి..ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని .. ఈ సమయంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు విశేష ఫలితాన్నిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ విషయం అందరకీ తెలియజెప్పేందుకే మకర సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటింటికి వచ్చే హరిదాసులు విష్ణు స్వరూపంగా, బసవన్నలు శివ స్వరూపంగా భావిస్తారు.
దక్షిణాయనం పితృదేవతల ఆరాధనకు మంచిది..అయితే ఉత్తరద్వారం తెరిచి దేవతలు నిద్రలేచే సమయం కావడంతో సంక్రాంతికి పితృ దేవతలకు తర్పణాలు విడుస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయి.
Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!