మాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహం
మన్మోహన్ సింగ్ కి స్మారకమా? మరి నా తండ్రికెందుకు అడగలేదు అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. మన్మోహన్ సింగ్ మరణం తర్వాత ప్రత్యేక స్మారకం కోసం PM మోదీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. పార్టీకి సేవలందించి, రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్లు స్మారకమే అడగలేదని గుర్తు చేశారు. కనీసం CWC మీటింగ్ పెట్టి సంతాపం కూడా ప్రకటించలేదని ఆరోపించారు. ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా.. KR నారాయణను CWC సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీ ద్వారా తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ స్మారక చిహ్నం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మల్లికార్జున్ ఖర్గే నుంచి ఆ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి అభ్యర్థన వచ్చిందని తెలిపింది. ఆ తర్వాతే ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠ ఈ అంశాన్ని లేవనెత్తారు.