అన్వేషించండి

Petrol Manufacturing Process:పెట్రోల్ బంక్ వరకు చేరే ఇంధనం వెనుక రహస్యాలేంటి? ముడి చమురు నుంచి పెట్రోల్ తయారీ ప్రక్రియ ఏంటీ?

Petrol Manufacturing Process:పెట్రోల్‌ తయారీ ప్రక్రియ నేరుగా పెట్రోల్‌తో మొదలవ్వదు. దీనికి మూల ముడి చమురు. లేదా క్రూడ్ ఆయిల్. దీనిని భూమిలో చాలా లోతుగా డ్రిల్లింగ్ చేసి బయటకు తీస్తారు.

Petrol Manufacturing Process: ప్రస్తుతం ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్, గ్యాస్ గురించే చర్చ నడుస్తోంది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అన్ని వర్గాలను ఎఫెక్ట్ చేసింది. పశ్చిమాసియాలో అశాంతి వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా దెబ్బతిన్నది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మనం రోజూ బైక్ లేదా కార్లలో పెట్రోల్ ఫిల్ చేయించుకుంటాం కానీ, అసలు ఈ పెట్రోల్‌ ఎక్కడ పుడుతుంది. అది మన దాకా ఎలా వస్తుంది. భూమిలో నుంచి తీసిన నల్లటి ద్రవం మన ఇంజిన్‌ను నడిపే స్వచ్ఛమైన ఇంధనంగా ఎలా మారుతుంది వంటి ఆసక్తికరమైన విషయాలు గురించి ఇక్కడ చూద్దాం. 

భూగర్భం నుంచి ముడి చమురు వెలికితీత 

పెట్రోల్‌ తయారీ ప్రక్రియ నేరుగా పెట్రోల్‌తో మొదలవ్వదు. దీనికి మూల ముడి చమురు. లేదా క్రూడ్ ఆయిల్. దీనిని భూమిలో చాలా లోతుగా డ్రిల్లింగ్ చేసి బయటకు తీస్తారు. ఇది చూడటానికి చాలా నల్లగా చిక్కటి ద్రవంలా ఉంటుంది. దీనిని మనం నేరుగా వాహనాల్లో వాడ లేదు. ఎందుకంటే ఈ నల్లటి ద్రవంలో పెట్రోల్‌తోపాటు మనం ఇంట్లో వాడే ఎల్‌పీజీ, కిరోసిన్, డీజిల్‌, లూబ్రికేటింగ్‌ ఆయిల్‌, రోడ్లు వేయడానికి వాడే తారు వంటి ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి. 

అసలైన మార్పు ఇక్కడే 

భూమిలో నుంచి తీసిన ఈ ముడి చమురును పైపులైన్ల లేధా భారీ నౌకల ద్వారా రిఫైనరీలకు తరలిస్తారు. ఇటీవలే ఇరాన్ యుద్ధం కారణంగా హుర్ముజ్‌ జలసంధిలో మన భారతీయ కెప్టెన్ సుక్షాంత్‌ సింగ్ సంధు ఇలాంటి చమురు నౌకనే ప్రాణాలకు తెగించి ముంబైకి చేర్చారు. రిఫైనరీకి చేరుకున్న తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ ఫ్యూరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. 

మరిగించడం- డిస్టిలేషన్ టవర్

రిఫైనరీలో ఒక పెద్ద ఫర్నెస్‌ ఉంటుంది. ఇది పొయ్యిలాంటిదన్నమాట. అందులో ఈ ముడి చమురును 350 నుంచి 400 డిగ్రీల సెల్సియస్‌ వరకు విపరీతంగా వేడి చేస్తారు. అంత వేడి తగలగానే ఆ నల్లటి ద్రవం రిగి గ్యాస్ లా మారిపోతుంది. ఈ వేడి గ్యాస్‌ను పొడవాటి డిస్టిలేషన్ టవర్‌లోకి పంపిస్తారు. ఈ టవర్‌కు ఒక ప్రత్యేక ఉంది. ఇందులో కింద భాగంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది.

ఇక్కడి నుంచి వివిధ ఉత్పత్తులు వస్తాయి

ఆవిర రూపంలో ఉన్న చమురు ఆ టవర్‌లోకి పైకి ప్రయాణిస్తున్నప్పుడు అది చల్లబడి మళ్లీ లిక్విడ్‌గా మారుతుంది. అయితే ఒక్కో పదార్థం ఒక్కో టెంపరేచర్‌ దగ్గర లిక్విడ్‌గా మారుతుంది. 

తారు  

ఇది చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి టవర్‌ అడుగు భాగంలో సెటిల్ అయిపోతుంది. దీనిని రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారు. 

డీజిల్‌, హెవీ ఆయిల్స్ 

ఇవి మధ్యస్థం కంటే కొంచెం కింద భాగంలో లిక్విడ్‌గా మారుతాయి. 

పెట్రోల్‌

ఇది కొంచెం తేలికైనది. కాబట్టి టవర్ మధ్య భాగం వరకు ఆవి రూపంలో వెళ్లి అక్కడ టెంపరేచర్‌ ద్వారా లిక్విడ్‌గా మారుతుంది. అక్కడే దీనిని వేరు చేసి సేకరిస్తారు. 

ఎల్పీజీ గ్యాస్‌

ఇది అన్నింటి కంటే తేలికైనది కాబట్టి ఆవిరి రూపంలో టవర్ పైభాగం వరకు వెళ్లి అక్కడ సేకరిస్తారు. 

ఇంజిన్ కోసం స్పెషల్ టచ్‌ 

టవర్ నుంచి సేకరించిన పెట్రోల్‌ను నేరుగా వాడు. దీనిని మళ్లీ ప్యూరిఫై చేస్తారు. మీ వాహనం ఇంజిన్ పాడవకుండా ఉండటానికి, మరింత మైలేజీ రావడానికి ఇందులో కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్‌ కలుపుతారు. ఆ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాతే అది మన రోజూ చూసే పెట్రోల్‌గా మారి, పెట్రోల్‌ బంకులు చేరుకుంటుంది. 

మనం బైక్‌లో పోయించుకున్న పెట్రోల్‌ వెనుక ఇంత పెద్ద ప్రక్రియ ఉంది. భూమిలోంచి తీయడం, వేల కిలోమీటర్‌లు ప్రయాణించి రిఫైనరీ చేరడం, అక్కడ 400 డిగ్రీల దగ్గర మరిగించడం, ఇదంతా ఒక యజ్ఞంలా సాగుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget