అన్వేషించండి

Petrol Pump Safety Tips: కారుకు పెట్రోల్ కొట్టించేటప్పుడు మోసాలు జరగకుండా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!  

Petrol Pump Safety Tips: చాలా మంది తమ వాహనాల్లో పెట్రోల్ నింపేటప్పుడు చాలా రిలాక్ష్‌ అయిపోతారు. ఇది మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ విషయాలపై నిఘా పెట్టండి.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ కొట్టించేటప్పుడు మీటర్ 0.00 నుంచి మొదలవుతుందో లేదో చూసుకోండి.
  • గన్‌ను లాక్ చేసి ఫ్యూయల్ నింపడం ద్వారా గాలి బదులు పెట్రోల్‌ వస్తుంది.
  • మీటర్ రీడింగ్‌పై దృష్టి ఉంచి, అవసరమైతే కారు దిగి తనిఖీ చేయండి.
  • నమ్మకమైన పెట్రోల్ బంకుల్లోనే ఇంధనం నింపడం ద్వారా మోసాలను నివారించవచ్చు.

Petrol Pump Safety Tips: కారులో పెట్రోల్‌ కొట్టించేటప్పుడు చాలా మంది డ్రైవింగ్ సీటు నుంచి కదలకుండా ఉండిపోతారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. కొన్నిసార్లు ఇది మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే అలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పెట్రోల్ నింపేటప్పుడు మోసాలు జరగకుండా సులభంగా నివారించవచ్చు.

మీ వాహనానికి ఫ్యూయల్‌ నింపేటప్పుడు, ముందుగా డిస్పెన్సింగ్ మెషీన్‌ను చెక్ చేయడం చాలా అవసరం. ఫ్యూయల్‌ నింపే ముందు, మీటర్ 0.00 నుంచి ప్రారంభమవుతుందో లేదో ఒక్కసారి చూసుకోండి. పెట్రోల్ పంపుల వద్ద చాలా మంది మీ దృష్టిని మరల్చి మోసం చేస్తుంటారు. అక్కడ పని చేసే సిబ్బంది ప్రశ్నలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తారు. మరొకరు టైర్ లేదా విండ్‌షీల్డ్ వైపు చూపిస్తారు. ఈలోగా చేయాల్సింది చేసేస్తారు. వారితో మాట్లాడుతూనే మీటర్ రీడింగ్‌పై దృష్టిని ఉంచండి. మీరు పని పూర్తి చేసిన తర్వాత బిల్లును పొందాలని గుర్తు పెట్టుకోండి. 

పెట్రోల్‌ పోసే గన్ ఎలా యూజ్ చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. కొందరు ఈ విషయంలో కూడా మోసం చేస్తుంటారు. ఫ్యూయల్‌ ఫిల్ చేసే వ్యక్తి పదే పదే ట్రిగ్గర్‌ను విడుదల చేసి నొక్కితే, గాలి పైపును నింపుతుందని అర్థం. దీని ఫలితంగా ట్యాంక్‌లోకి తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ పోస్తారు. నాజిల్‌ను లాక్ చేసి ట్యాంక్‌ను ఫిల్ చేయడం మంచిది. అలా చేస్తేనే గాలికి బదులు మొత్తం ఫ్యాయల్‌ నింపినట్టు అవుతుంది. 

కొన్నిసార్లు, సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మీటర్ స్పష్టంగా కనిపించని ప్రదేశంలో నిల్చుంటారు. అప్పుడు కూడా రీడింగ్‌లో మోసాలు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, కారు దిగి మీరే మెషిన్‌ వద్ద నిలబడాలి. అప్పుడే అక్కడ జరిగే మోసాన్ని మీరు గుర్తించగలుగుతారు. మీర చూస్తున్నట్టు అయితే సిబ్బంది మోసాలు చేయడానికి సాహసించరు.  

వెహికల్‌లో తక్కువ ఫ్యూయల్ నింపారని గ్రహిస్తే వెంటనే పరిమాణ చెక్ చేయమని డిమాండ్ చేయవచ్చు. ప్రతి పంపుకు మెజరింగ్‌ జార్స్ ఉంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మీరు ఒకే ప్రాంతంలో పేరున్న పెట్రోల్ బంకులోనే ఫ్యూయల్ నింపడం చాలా మంచిది. మీరు వేర్వేరు బంకుల్లో ఫ్యూయల్ కొట్టించడం వల్ల కూడా మీ వాహనానికి ముప్పు పెరుగుతుంది.  

చాలా పెట్రోల్ పంపుల్లో కనురెప్ప వేసే లోపు మోసాలు జరిగిపోతాయి. అందుకే మీటర్‌ను చూడటం, ఏకగ్రతతో ఉండటం, సరిగ్గా ఫ్యాయల్ నింపడం అనేవి మూడు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. కొంచెం అవగాహన ప్రతిసారీ మిమ్మల్ని నష్టాల నుంచి కాపాడుతుంది.

Frequently Asked Questions

పెట్రోల్ కొట్టించేటప్పుడు మీటర్ 0.00 నుంచి ప్రారంభమవుతుందో లేదో ఎలా చూసుకోవాలి?

పెట్రోల్ నింపే ముందు, డిస్పెన్సింగ్ మెషీన్ వద్ద మీటర్ 0.00 నుంచి ప్రారంభమవుతుందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. దీనివల్ల మోసాలను నివారించవచ్చు.

పెట్రోల్ పంపుల వద్ద జరిగే మోసాలను ఎలా గుర్తించాలి?

పని చేసే సిబ్బంది మీ దృష్టిని మరల్చి, ప్రశ్నలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వారితో మాట్లాడుతూనే మీటర్ రీడింగ్ పై దృష్టి ఉంచడం ముఖ్యం.

పెట్రోల్ పోసే గన్ విషయంలో ఎలాంటి మోసాలు జరుగుతాయి?

కొందరు ట్రిగ్గర్ ను పదే పదే విడుదల చేసి నొక్కితే, గాలి పైపు నిండి తక్కువ పెట్రోల్ పడవచ్చు. నాజిల్ ను లాక్ చేసి ఫిల్ చేయడం మంచిది.

మీటర్ కనిపించని ప్రదేశంలో నిలబడితే ఏం చేయాలి?

అలాంటి పరిస్థితిలో, కారు దిగి మీరే మెషిన్ వద్ద నిలబడాలి. అప్పుడు జరిగే మోసాన్ని గుర్తించగలుగుతారు.

తక్కువ ఫ్యూయల్ నింపారని అనుమానం వస్తే ఏం చేయాలి?

వెంటనే పరిమాణాన్ని చెక్ చేయమని డిమాండ్ చేయవచ్చు. ప్రతి పంపుకు మెజరింగ్ జార్స్ ఉంటాయి, వాటితో సరిచూసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
5 నిమిషాల్లోనే 70 శాతం ఛార్జ్.. EV Charging లో సంచలనం సృష్టిస్తున్న కొత్త టెక్నాలజీ
350cc బైక్‌ Triumph Tracker 400 రియల్‌ మైలేజ్‌ గురించి తెలుసా? లీటర్ పెట్రోల్‌తో ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే?
Triumph Tracker 400 నిజమైన మైలేజ్ ఎంత? సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై అసలు లెక్క ఇదే!
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget