అన్వేషించండి

Mahindra XUV700 కొనాలనుకుంటున్నారా? సిటీలో నెలకు 600-700km రన్నింగ్‌కి ఏ వేరియంట్‌ బెస్ట్‌ - Petrol లేదా Diesel?

XUV700 కొనాలనుకుంటున్నారా? నెలకు 600-700km రన్నింగ్‌, నగరంలో 70% డ్రైవింగ్‌ చేసే వారికి పెట్రోల్‌ కారే బెస్టా? Dieselలో DPF సమస్యలు ఎలా వస్తాయి?.

Mahindra XUV700 Petrol Vs Diesel Guide: మహీంద్రా XUV700 కొనాలని ప్లాన్‌ చేస్తున్నవారికి ఒక పెద్ద సందేహం ఎప్పుడూ ఉంటుంది - పెట్రోల్‌ వేరియంట్‌ తీసుకోవాలా? డీజిల్‌ వేరియంట్‌ తీసుకోవాలా? అని. మీ రన్నింగ్‌, వాడే స్టైల్‌, ట్రాఫిక్‌ పరిస్థితులు ఇవన్నీ కలిసి ఏ వేరియంట్‌ మీకు సరిపోతుందో నిర్ణయిస్తాయి. నెలకు 600–700 కి.మీ. రన్నింగ్‌, ఇందులో దాదాపు 70% నగరంలోనే డ్రైవింగ్‌ చేసేవాళ్లు మనలో చాలామంది ఉన్నారు. ఈ సందర్భంలో పెట్రోల్‌ XUV700నే అనువైన ఎంపికగా ఆటో ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు.

Mahindra XUV700 Petrol ఎందుకు బెస్ట్‌?

పెట్రోల్‌ XUV700 ధర డీజిల్‌తో పోలిస్తే తక్కువ. అదే వేరియంట్‌కి డీజిల్‌ వెర్షన్‌ దాదాపు ఒక లక్ష రూపాయలకు పైగా ఖరీదు ఎక్కువ. నెల రన్నింగ్‌ 600–700 కి.మీ. మాత్రమే కావడంతో డీజిల్‌ ద్వారా వచ్చే మైలేజ్‌ అదనపు లాభం చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే రికవర్‌ అవుతుంది. అంటే ఫ్యూయల్‌ సేవింగ్‌ కోసం డీజిల్‌ తీసుకున్నా కూడా ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుంది.

సిటీ డ్రైవింగ్‌లో Diesel ఎందుకు రిస్కీ? (DPF సమస్య)

డీజిల్‌ కార్లలో ప్రస్తుతం DPF (Diesel Particulate Filter) సిస్టమ్‌ తప్పనిసరి. ఇది పొగను ఫిల్టర్‌ చేస్తుంది. కానీ సిటీ డ్రైవింగ్‌లో చిన్న చిన్న దూరాలు, తరచూ బ్రేక్‌లు, తక్కువ స్పీడ్‌ వలన DPF క్లాగ్‌ అవ్వడం చాలా సాధారణం. 70% డ్రైవింగ్‌ నగరంలోనే చేస్తే:

  • DPF రీజనరేషన్‌ తరచూ వస్తుంది
  • వాహనం పవర్‌ తగ్గినట్టు అనిపిస్తుంది
  • వర్క్‌షాప్‌కి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు
  • ఈ ఇబ్బందులు పెట్రోల్‌లో ఉండవు.

Mahindra XUV700 కొన్నే ముందు ఒక చిన్న సూచన - ఫేస్‌లిఫ్ట్‌ వస్తోంది

Mahindra XUV700 Facelift లాంచ్‌ చాలా దగ్గరలోనే ఉందని సమాచారం. ఫేస్‌లిఫ్ట్‌లో రావొచ్చు అనుకుంటున్న అప్‌డేట్స్‌:

  • కొత్త స్టైలింగ్‌
  • మరిన్ని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
  • సస్పెన్షన్‌లో మెరుగుదల
  • ఇన్ఫోటైన్‌మెంట్‌ అప్‌డేట్స్‌

కొత్త సంవత్సరం (2026) సందర్భంగా, జనవరిలో Mahindra XUV700 కారు కొనాలని అనుకుంటున్నవాళ్లు మరికొన్ని రోజులు ఆగి, కొత్త మోడల్‌ ఎలా ఉందో చూడటం మంచిది.

మరొక ఆప్షన్‌ - Mahindra XEV 9S (రాబోయే 7-సీటర్‌ EV)

నెల రన్నింగ్‌ 600–700 కి.మీ. మాత్రమే కావడంతో ఎలక్ట్రిక్‌ వాహనం కూడా ఈ సందర్భానికి సెట్‌ అవుతుంది.

అప్‌కమింగ్‌ XEV 9Sలో:

  • ఏడు సీట్లు వస్తాయి
  • XEV 9Eలో ఉన్నట్లే ఒక్కటే బ్యాటరీ సైజ్‌ ఉండే అవకాశం
  • మంచి రేంజ్‌
  • హోమ్‌ చార్జింగ్‌
  • చాలా తక్కువ రన్నింగ్‌ ఖర్చులు

ఈ కారణాల వల్ల, రాబోయే EV కూడా ఒక మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. 

మీ అవసరాలు, రన్నింగ్‌, నగర వాడకాన్ని దృష్టిలో పెట్టుకుంటే Petrol XUV700 మీకు సరైన ఎంపిక అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget