అన్వేషించండి

Blinkit Ambulance: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌

Ambulance in 10 minutes: జొమాటో ఆధ్వర్యంలో పని చేసే బ్లింకిట్, 10 నిమిషాల్లో అంబులెన్స్ సేవను గురుగావ్‌ నుంచి ప్రారంభించింది. అతి త్వరలో ఇతర నగరాల్లోనూ ఈ సేవ అందుబాటులోకి వస్తుంది.

 Blinkit-Zomato New Ambulance Service In 10 Minutes: ప్రజల అవసరాలకు తగ్గట్లుగా క్విక్‌ కామర్స్‌ (Quick Commerce) రంగం రూపరేఖలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకు, క్విస్ కామర్స్ కంపెనీలు కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికి కిరాణా సామాగ్రి లేదా కూరగాయలు లేదా మరికొన్ని చిన్నపాటి వస్తువులు డెలివరీ చేసేవి. ఇప్పుడు, ప్రజలకు అత్యంత కీలకమైన & ప్రాణాలను కాపాడే సర్వీస్‌ కూడా క్విక్‌ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌లో యాడ్‌ అయింది. 

ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే, కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. జొమాటో (Zomato)కు చెందిన శీఘ్ర వాణిజ్య సంస్థ (క్విక్‌ కామర్స్‌ కంపెనీ) బ్లింకిట్‌.. 10 నిమిషాల్లో అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. మొదట, సైబర్ సిటీ గురుగావ్‌ నుంచి ఈ సేవను ప్రారంభించింది.

10 నిమిషాల్లో అంబులెన్స్‌ సర్వీస్‌ ఎలా పొందాలి?       
బ్లింకిట్‌ CEO అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో దీని గురించి వివరించారు. గురుగావ్‌లో తక్షణం & విశ్వసనీయమైన అంబులెన్స్ సేవలను అందించేందుకు తాము మొదటి అడుగు వేయబోతున్నట్లు వెల్లడించారు. మొదటి ఐదు అంబులెన్సులు గురుగావ్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. బ్లింకిట్‌ యాప్‌లో 'బేసిక్ లైఫ్ సపోర్ట్' (BLS) అంబులెన్స్‌ ఆప్షన్‌ ద్వారా అంబులెన్స్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అంబులెన్స్‌లో అన్ని సౌకర్యాలు       
బ్లింకిట్‌ అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్, AED (ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్‌, అవసరమైన అత్యవసర మందులు & ఇంజెక్షన్‌లు సహా అవసరమైన ప్రాణాలను రక్షించే పరికరాలు ఉంటాయని అల్బిందర్ ధిండా వెల్లడించారు. ప్రతి అంబులెన్స్‌లో పారామెడిక్, సహాయకుడు, శిక్షణ పొందిన డ్రైవర్ ఉంటారు. అత్యవసర సమయంలో అధిక నాణ్యత గల వైద్య సేవను తాము అందించగలమని అల్బిందర్ ధిండా తెలిపారు.

ఇతర నగరాలకు సేవల విస్తరణ       
బ్లింకిట్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ లక్ష్యం లాభార్జన కాదని అల్బిందర్ ధిండా X పోస్ట్‌లోవెల్లడించారు. ఈ సేవను వినియోగదారులకు చాలా తక్కువ ధరతో అందిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు కిట్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ను విస్తరించే లక్ష్యంతో పని చేస్తామని తెలిపారు. అంబులెన్స్‌కు దారి ఇచ్చి, ప్రాణాలు కాపాడే వ్యక్తిగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా రూ.8,700 పెరిగిన పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget