అన్వేషించండి

Today Top Headlines: తిరుమలకు వెళ్లే వీఐపీ భక్తులకు అలర్ట్ - తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. తిరుమల వెళ్లే వీఐపీ భక్తులకు అలర్ట్

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి మొదలవుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీడీ అధికారులు. టీటీడీ అడిషనల్ EO వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు, CVSO శ్రీధర్ ఏర్పాట్లు మొత్తం పరిశీలించారు. ఇంకా పెండింగ్ ఏర్పాట్లపై చర్చించారు. అదే సమయంలో భక్తులు అనుసరించాల్సిన నియమాల గురించి స్పష్టత ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య 'జ‌న‌వ‌రి 10, 11, 12.. ఈ మూడు రోజుల్లో భారీగా ఉంటుంది. ఇంకా చదవండి.

2. వైసీపీ నేత సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా.?

ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అన్నీ తానై వ్యవహరించిన సజ్జలరామకృష్ణారెడ్డి మెడకు మరో వివాదం చుట్టుకునేలా కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయం కేసులో ఆయన పేరు ఉందని తర్వాత కాదంబరి జత్వాని ఇలా వేర్వేరు కేసుల్లో ఆయన పేరు ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. అన్నీ సైలెంట్ అయ్యాయని అనుకుంటున్న టైంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండల రెవెన్యూ పరిధిలో సజ్జల కుటుంబానికి సాగుభూమి ఉంది. అందులో దాదాపు 50 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా చదవండి.

3. మండపేటలో రేవ్ పార్టీ కలకలం

న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు... సొషల్ మీడియాలో వీడియోలు హ‌ల్‌చ‌ల్‌. మొన్న ఏలూరులో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్టినరోజు పేరున రేవ్ పార్టీ నిర్వహించడం దుమారం రేపింది. తాజాగా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా మండపేటలో నూతన సంవత్సర వేడుకల పేరిట రేవ్‌ పార్టీ చేయడం కలకలం రేపుతోంది. మహిళల చేత అశ్లీలంగా నృత్యాలు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా భారీ లైటింగు డిజె సౌండ్లు పెట్టుకుని ఓ లేఔట్ లో చేసిన నృత్యాల వీడియోలు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంకా చదవండి.

4. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే  కిలో బియ్యం అందజేస్తున్నా.. ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు. కొందరు కనీసం బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే ఆ మేరకు డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇంకా చదవండి.

5. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి 3 రోజుల సెలవులు

తెలంగాణలో సంచలనంగా మారిన సీఎంఆర్ కాలేజీ హాస్టల్‌లో వీడియోల చిత్రీకరణ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్‌లో దొరికిన ఫింగర్ ప్రింట్స్‌, అనుమానితుల వేలి ముద్రలను మ్యాచ్‌ చేస్తూ ఎంక్వయిరీ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీ హాస్టల్ నెలకొన్న వివాదం ఎంత సంచలనంగా మారిందో చెప్పనవసరం లేదు. జనవరి 1 రాత్రి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget