అన్వేషించండి

Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?

Telangana Govt News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల సర్కార్‌పై అదనంగా రూ.1500 కోట్ల భారం పడనుంది.

Telangana News: తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్‌కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ‌్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది.

పేదలకు సన్నబియ్యం
తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. పేదలకు రూపాయికే  కిలో బియ్యం అందజేస్తున్నా...ప్రజలెవ్వవరూ వాటిని తినడం లేదు. కొందరు కనీసం బియ్యం తీసుకోకుండా రేషన్ దుకాణాల్లోనే ఆ మేరకు డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం ఏమాత్రం తినడానికి పనికిరావని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఆ బియ్యం వివిధ మార్గాల ద్వారా  కాకినాడ, చెన్నై పోర్టులకు చేరి అక్కడి నుంచి విదేశాలకు తరలిపోతోంది. దీంతో పేదలకు సన్నబియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ముందుగానే కసరత్తు ప్రారంభించిన  సర్కార్....ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు పెద్దఎత్తున సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించింది. క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో  రాష్ట్రవ్యాప్తంగా  రైతులు సైతం ఈసారి సన్న వడ్లు పండించారు.

అదనపు వ్యయం
రాష్ట్రంలో మొత్తం 89.60 లక్షల మంది  రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ బియ్యం పంపిణీ చేయాలంటే  నెలకు 2 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుంది. ఏటా  24 లక్షల టన్నుల సన్న బియ్యం కావాలని అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు  ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యంపై రాష్ట్రప్రభుత్వం 3వేల600 కోట్ల సబ్సిడీ భరిస్తుండగా... సన్నబియ్యంతో పంపిణీతో మరో 1,500 కోట్లు భారం పెరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 20 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 

ఉగాది నుంచి ప్రారంభం
తెలుగు సంవత్సరాది  ఉగాది నుంచే పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగానే  సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త రేషన్‌ కార్డుల కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..వారిలో కనీసం 10 లక్షల మందికి కార్డులు ఇవ్వనున్నట్లు  సమాచారం. దొడ్డు బియ‌్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ ద్వారా  పేదలు ఉపయోగంతోపాటు వరి ధాన్యం పండించే రైతులనూ ఆదుకోవచ్చని సర్కార్ భావిస్తోంది. అలాగే రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టవచ్చని  ప్రభుత్వం భావిస్తోంది.

బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు కళ్లెం వేయవచ్చని అంచనా వేస్తోంది. సన్నబియ్యం సేకరణకు కిలోకు  55 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 36 రూపాయలు  కేంద్రం భరిస్తుండగా...మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే సర్దుబాటు చేయాల్సి ఉంది. సంక్రాంతి కానుకగానే పేదలకు సన్నబియ్యం పంపిణీకి సర్కార్ ఏర్పాట్లు చేయగా....రైతుల నుంచి సేకరించిన సన్న వడ్లు కనీసం రెండు నెలలైనా  నిల్వ  చేస్తేనే బాగుంటాయని...ఇప్పటికిప్పుడు కొత్త బియ్యం అందజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు సూచించారు. దీంతో ఉగాది నాటికి బియ్యం సిద్ధం చేసి పంపిణీ చేసేందుకు రేవంత్‌రెడ్డి  ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి`

టాప్ హెడ్ లైన్స్

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget