ACB Notice To kTR: కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Formula E Case : ఆరో తేదీన తమ ఎదుట హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత రోజు ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది.
ACB has issued notices to KTR to appear before them on the 6th: ఫార్ములా ఈ రేసులో రూ. 55 కోట్ల గోల్ మాల్ జరిగిందన్న కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు షాక్ ఇచ్చారు. ఆరో తేదీన .. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ నోటీసులు జారీ చేస్తుందని కేటీఆర్ క్యాంప్ అనుకోలేదు. క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయి.. తీర్పు పెండింగ్ లో ఉండటంతో తీర్పు వచ్చే వరకూ ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోదనుకున్నారు.కానీ హఠాత్తుగా నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ వర్గం విస్మయానికి గురవుతోంది.
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో అసలు పస లేదని.. అవినీతే జరగనప్పుడు కేసు చెల్లదని కేటీఆర్ వాదిస్తున్నారు. అందుకే విచారణకు హాజరయ్యేది లేదని కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్దార్ధ దవే వాదనలు విననిపించారు. కేటీఆర్ పై కేసు నమోదు చేస్తే ఇక మంత్రిగా పనిచేసిన వారెవరూ సంతకాలు చేయలేరన్నారు. అక్కడ ప్రొసీజర్ ల్యాప్స్ ఉండవచ్చేమో కానీ అవినీతి లేదని వాదించారు. ఏసీబీ అధికారులకు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పలేకపోయారని కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లోచెప్పారు. ఈ కేసు లొట్టపీసుస కేసు అన్నారు. అందుకే తనపై కేసును క్వాష్ చేస్తారని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.
Also Read: ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న
మరో వైపు ఆయనకు ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. రూ. 55 కోట్లు అక్రమంగా తరలిపోయినందున విచారణ ప్రారంభించారు. ఏ టు గా ఉన్న అర్వింద్ కుమార్, ఏ త్రీగా ఉన్న మాజీ ఉన్నతాధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. అయితే వారు ఈడీ ఎదుట హాజరు కాలేదు. తమకు సమయం కావాలని అన్నారు. కేటీఆర్ కూడా ఈడీ ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా లేరు. తాను న్యాయనిపుణుల సలహాలు తీసుకుని వారి సూచనలకు అనుగుణంగా నడుచుకుటానని ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖ కేసు పెట్టింది. మున్సిపల్ శాఖ నుంచి నిధులు మాయమయ్యాయి. ఓ విదేశీ సంస్థకు వెళ్లాయి. చెల్లించేందుకు ఆర్థికశాఖ అనుమతి.. కేబినెట్ అనుమతి లేదు. ఈ రేస్‌లో రూ.55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా తరలించారని ఆరోపిస్తోంది. కేసుతో సంబంధం ఉన్నవారందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి, విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్నారు. ఇప్పటికే ఫిర్యాదు దారు అయిన దాన కిషోర్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు.