By: Arun Kumar Veera | Updated at : 03 Jan 2025 11:35 AM (IST)
కార్డ్‌పై ఉండే ఏ నంబర్ తొలగించాలి? ( Image Source : Other )
CVV Number On Debit Card Or Credit Card: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు & నేరాల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత అప్‌గ్రేడ్ అవుతుంటే సైబర్ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒక్క చిన్న పొరపాటు వల్ల ప్రజల బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతోంది. కష్టార్జితాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే, మీరు, మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ATM కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలకు సంబంధించి మరింత జాగ్రత్త అవసరం.
వాస్తవానికి, డెబిట్ కార్డ్ (ఏటీఎం కార్డ్) లేదా క్రెడిట్ కార్డ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉంటాయి. అందువల్ల, వీటికి సంబంధించి మీరు చేసే చిన్న పొరపాటు మీ జేబుకు భారంగా మారొచ్చు. బ్యాంక్ ఖాతాదార్ల భద్రత పెంచడానికి, సైబర్ నేరాలకు కళ్లెం వేయడానికి భారతీయ కేంద్ర బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చాలా రోజుల క్రితమే దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు వార్నింగ్ కూడా పంపింది. ఓ నంబర్‌ను డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి తొలగించమని లేదా దాచమని బ్యాంక్‌లకు సూచించింది. ఆర్‌బీఐ నిర్ణయం జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
కార్డ్‌పై ఉండే ఏ నంబర్ తొలగించాలి?
మీ వద్ద ఉన్న ATM కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ మీద, 3 అంకెల CVV నంబర్ ఉంటుంది. CVV అనేది "కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ" (Card Verification Value)కు సంక్షిప్త నామం. ఈ నంబర్ అత్యంత కీలకం & రహస్యంగా ఉంచాల్సిన విషయం. మీరు ఎక్కడైనా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లింపు చేసినప్పుడు ఈ నంబర్ అవసరం అవుతుంది. CVV నంబర్ లేకుండా మీ కార్డ్ ధృవీకరణ సాధ్యం కాదు. ఒకవేళ, సైబర్ మోసగాళ్లకు మీ కార్డ్ మీద ఉండే 16 అంకెల సంఖ్య తెలిసినా, CVV తెలీకపోతే అతను ఏమీ చేయలేదు. అందుకే ఇది అత్యంత కీలకమైన నంబర్. ఏటీఎం కార్డు సమాచారంతో పాటు CVV నంబర్ మోసగాడి చేతిలో పడితే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. క్రెడిట్ కార్డ్ విషయంలో - మీ కార్డ్‌లో ఉన్న లిమిట్ మొత్తానికి సైబర్ నేరగాళ్లు షాపింగ్ చేస్తారు, బిల్లు మీ చేతికి వస్తుంది.
మీ డబ్బు సేఫ్‌గా ఉండాలంటే?
అందుకే, మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌పై ఉండే CVV నంబర్‌ను ఎప్పుడూ దాచి ఉంచాలని ఆర్‌బీఐ చెబుతోంది. వీలైతే, దానిని ఎక్కడైనా నోట్ చేసి మీ కార్డ్ నుండి తొలగించాలని సూచించింది. ఇలా చేసిన తర్వాత, మీ కార్డ్ పోగొట్టుకున్నా లేదా తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినా, దానిపై CVV నంబర్ ఉండదు కాబట్టి ఎక్కడా ఉపయోగించలేరు. తద్వారా, మీరు & మీ డబ్బు సురక్షితంగా ఉంటారు.
కార్డ్ వివరాలు సేవ్ చేయడం మానుకోవాలి
మీరు ఆన్‌లైన్ మోసం బారిన పడకూడదనుకుంటే, మీ కార్డ్ పిన్ (PIN)ను అదే కార్డ్‌పై రాసి పెట్టుకోవడం, కార్డ్ వివరాలను ఫోన్‌లో దాచడం లేదా కార్డ్‌ను ఫోటో తీసి పెట్టుకోడం, ఫోన్ కాంట్రాక్ట్స్‌లో కార్డ్ నంబర్‌ను సేవ్ చేయడం వంటివి చేయకూడదు. మీరు ఇప్పటికే ఈ పని చేసే ఉంటే, వెంటనే వాటిని డిలీట్ చేయండి. అంతేకాదు, మీరు ఏదైనా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ నుంచి చెల్లింపు చేసినప్పుడు, భవిష్యత్తులో చెల్లింపు త్వరగా జరిగేందుకు, మీ కార్డ్ వివరాలను సేవ్ చేయాలా అని ఆ ప్లాట్‌ఫామ్ అడుగుతుంది. దానికి మీరు నో (No) చెప్పాలి. ప్లాట్‌ఫారమ్ సురక్షితంగా లేకుంటే మీ కార్డ్ సమాచారం కూడా సురక్షితంగా ఉండదు. అందుకే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీ కార్డ్‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎప్పుడూ సేవ్ చేయకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్ కొత్త ఫీచర్
Rent Agreement Rules 2025 : అద్దెదారుల టెన్షన్‌కు పుల్‌స్టాప్, గృహ యజమానులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు! కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Silver Price: బంగారానికి పోటీగా వెండి రికార్డు పరుగు! 1.77 లక్షలకు చేరిన ధర
Income Tax Alert: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! డిసెంబర్‌లో ఈ 4 డెడ్‌లైన్స్ దాటితే ఫైన్, నోటీసులు
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్!
Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
November 2025 Car Sales: గత నెలలో జనం ఎక్కువగా కొన్న కార్లు - మారుతి ఫస్ట్, రెండు-మూడు స్థానాల్లో మహీంద్రా-టాటా