Nagoba Jatara 2025: జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Adilabad News | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కీలక ఆదేశాలు జారీ చేశారు.
Nagoba Jatara is tribal festival celebrated in Keslapur village | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జరగనున్న నాగోబా జాతర (Nagoba Jatara)ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని Adilabad కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కేస్లాపూర్ నాగోబా దేవాలయం దర్బార్ సమావేశంలో నాగోబా జాతరకు సంబంధించిన కో-ఆర్డినేషన్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అదనపు ఎస్పీ కాజల్, మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సంబంధిత అధికారులతో గురువారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
సౌకర్యాలు కల్పించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జనవరి 28వ తేదిన మహాపూజతో నాగోబా జాతర (Nagoba Jatara 2025) మొదలవుతుంది. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారి కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసి దర్శనం మంచిగా జరిగేటట్లు ఆన్ని మౌళిక వసతులు కల్పించాలి. సంబంధించిన అధికారులు దీనిపై ఫోకస్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ 21న కోఆర్డినేషన్ మీటింగ్
మొదటి సమావేశం నిర్వహిస్తున్నాం, తర్వాత కోఆర్డినేషన్ మీటింగ్ జనవరి 21న నిర్వహిస్తాం. ఆలోగా ఆయా శాఖల సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. నాగోబా జాతర కమిటీ సభ్యుల సూచన మేరకు రోడ్లు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, అత్యవసర వసతులు ఏం కావాలన్నా.. వాటిని వెంటనే చేయాలి. పోలీస్ బందోబస్తు, తదితర యాక్షన్ ప్లాన్ తయారుచేసి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల నుంచి తరలిరానున్న భక్తులు
అదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు తరలివచ్చే వారికి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. కనుక పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, భారికెడ్స్, గట్టి బందోబస్తు, తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హైమాస్ట్ దీపాలతో ఆలయం, పరిసరాలలో ఏర్పాటు చేయాలని తెలిపారు.
నేటి నుంచి నాగోబా ఆలయంలో సాధారణ పూజలు ప్రారంభం
ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ... శుక్రవారం నుంచి నాగోబా జాతర పూజలు ప్రారంభం అవుతాయని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముట్నూర్, హార్కాపూర్, రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలని, గత ఏడాదిలాగే ఈ జాతరను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, జాతర నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.