అన్వేషించండి

Ind Vs Aus Test Series: ఆరున్నర అడుగుల ఆల్ రౌండర్ వెబ్ స్టర్ - స్పిన్నర్ నుంచి పేసర్‌గా ఎదిగిన క్రికెటర్

Australia Team: ఎప్పటిలాగే మ్యాచ్‌కు ఒకరోజు ముందుగానే ఆసీస్ తమ తుదిజట్టును ప్రకటించింది. ఈసారి కొత్తగా ఒక ఆల్ రౌండర్‌ను అరంగేట్రం రూపంలో బరిలోకి దింపుతోంది. 

Beau Webster News: భారత్‌తో కొత్త సంవత్సరంలో జరిగే ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. స్టార్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో బ్యూ వెబ్ స్టర్‌ను జట్టులోకి తీసుకుంది. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడైన వెబ్ స్టర్.. అటు మిడిలార్డర్లో రాణించడంతో పాటు ఇటు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. 1993లో టాస్మానియాలో జన్మించిన వెబ్ స్టర్.. దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించడం సహా కీలక సమయాల్లో వికెట్లు తీసి, సిసలైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. మరోవైపు టెస్టుకు ఒక్క రోజు ముందు తుదిజట్టును ప్రకటించే సంప్రదాయాన్ని ఆసీస్ ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించింది. 

ఈ సిరీస్‌లో మూడో అరంగేట్రం..

ఆసీస్ తరఫున ఈ సిరీస్‌లో అరంగేట్రం చేయబోతున్న మూడో ఆటగాడు వెబ్ స్టర్ కావడం విశేషం. ఇంతకు ముందే ఓపెనర్లు నాథన్ మెక్ స్వినీ, శామ్ కొన్ స్టాస్ డెబ్యూ చేయగా, ఈ మ్యాచ్‌లో వెబ్‌స్టర్ ముచ్చట తీర్చుకుంటున్నాడు. నిజానికి తను తొలి టెస్టు నుంచే జట్టులో ఉండగా తుదిజట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక మార్ష్ ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అటు బ్యాటింగ్‌లో 73 పరుగులు చేసిన ఈ ఆల్ రౌండర్.. బౌలింగ్‌లో 3 వికెట్లు మాత్రమే తీసి నిరాశపర్చాడు. దీంతో గాయం సాకు చూపి, ఐదో టెస్టు నుంచి అతడిని జట్టులో నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. నిజానికి అంతకు ముందే మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్‌ను ఆడించాలని పలువురు మాజీలు సూచించారు.

స్పిన్నర్ నుంచి పేసర్‌గా..
నిజానికి వెబ్‌స్టర్ తొలుత స్పిన్ బౌలింగ్ వేసేవాడు. ఆ తర్వాత తన పంథా మార్చుకుని, పేస్ బౌలింగ్‌కు దిగాడు. నిజానికి ఆసీస్‌లో స్పిన్నర్లకు ఏమాత్రం అవకాశాలు లభించవు. ఇప్పటికే చాలామంది స్పిన్నర్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఆడమ్ జంపా లాంటి వైట్ బాల్ క్రికెటర్ ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడంటేనే స్పిన్నర్లకు ఆసీస్ జట్టులో అంతగా చోటు దక్కదని తెలుస్తోంది. ఇక, ఆసీస్ పిచ్‌లు పేస్‌కు సహకరిస్తాయి, కాబట్టి వెబ్ స్టర్ ఈ రూట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 93 మ్యాచ్‌లాడిన వెబ్ స్టర్ 5200 పరుగులకు పైగా చేశాడు. బౌలింగ్‌లో 184 వికెట్లు తీశాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టును భారత్ గెలుచుకోగా, రెండు, నాలుగో టెస్టులను ఆసీస్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో మూడో టెస్టు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. ఐదో టెస్టు గెలిస్తే, అటు బోర్డర్ - గావస్కర్ ట్రోఫిని దక్కించుకోవడంతోపాటు ఇటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా కన్ఫాం చేసుకుంటుంది. 

Also Read: Gambhir Clarification: డ్రెస్సింగ్ రూంలో వివాదాలపై స్పందించిన గంభీర్.. సిడ్నీ టెస్టుకి రోహిత్ డౌటే!.. గతంలో ఈ వివాదంపై ధోనీ సెటైర్లు

టాప్ హెడ్ లైన్స్

IND Playing XI Vs NZ: కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
IND VS PAK Final: కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Axar Patel Captaincy: కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Embed widget